తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2021, 4:33 AM IST

ETV Bharat / bharat

Horoscope Today (24-12-2021): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today (24-12-2021): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు

Horoscope Today (24-12-2021): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత రుతువు

మార్గశిర మాసం, బహుళ పక్షం

పంచమి:మ. 3.50 తదుపరి షష్ఠి

మఖ: రా. 1.07 తదుపరి పుబ్బ

వర్జ్యం: మ. 12.39 నుంచి 2.18 వరకు

అమృత ఘడియలు: రా.10.37 నుంచి 12.17 వరకు

దుర్ముహూర్తం: ఉ. 8.42 నుంచి 9.26 వరకు తిరిగి మ. 12.21 నుంచి 1.05 వరకు

రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు

సూర్యోదయం:ఉ.6.31, సూర్యాస్తమయం:సా.5-28

మేషం

ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మానసిక పీడ పెరుగుతుంది. పంచముఖ ఆంజనేయుని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

వృషభం

ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోవద్దు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.

మిథునం

సౌభాగ్య సిద్ధి ఉంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. లాభంలో చంద్రుడు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతా స్తుతి మంచిది.

కర్కాటకం

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివ నామాన్ని జపించాలి.

సింహం

విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఇష్ట దైవ నామస్మరణ మంచిది.

కన్య

ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జపించాలి.

తుల

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

వృశ్చికం

ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

ధనుస్సు

అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందూ,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాదన మానవద్దు. శివారాధన శుభప్రదం.

మకరం

ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అవసరం. శివనామస్మరణ ఉత్తమం.

కుంభం

శరీర సౌఖ్యం ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. యశస్సు వృద్ధి చెందుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.

మీనం

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధన వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

ABOUT THE AUTHOR

...view details