తెలంగాణ

telangana

ETV Bharat / bharat

August 10 Horoscope: ఈ రోజు రాశి ఫలం

ఈ రోజు (ఆగస్టు 10) రాశి ఫలాల (Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

daily horoscope
రాశి ఫలాలు

By

Published : Aug 10, 2021, 4:28 AM IST

ఆగస్టు 10వ తేదీన మీ రాశిఫలాలు(Horoscope Today) ఎలా ఉన్నాయంటే..

మేషం

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యవిషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.

వృషభం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దైవారాధన మానవద్దు.
మిథునం

శుభసమయం. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయసహకారాలు అందుతాయి. ఆంజనేయ దర్శనం మంచిది.

కర్కాటకం

చేపట్టే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. నూతన వస్తువులు సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. దైవబలం పెరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం. ముఖ్యమైన విషయాల్లో సొంతనిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. విష్ణు సందర్శనం శుభప్రదం.

సింహం

మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో సొంతనిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. విష్ణు సందర్శనం శుభప్రదం.

కన్య

ఉద్యోగంలో మీపై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జరిపించాలి.
తుల

కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవబలం రక్షిస్తోంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం మంచిది.

వృశ్చికం

ఒక పనిలో మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. అధికారుల సహకారం ఉంటుంది. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముఖ్య విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.

ధనుస్సు

మీ మీ రంగాల్లో మేలైన ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో మీకు సహాయం అందుతుంది. కీలక విషయాల్లో చురుగ్గా పనిచేస్తారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. శివ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
మకరం

మిశ్రమ వాతావరణం సూచితం. ఉద్యోగంలో అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉత్సాహంగా ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

కుంభం

ధనవృద్ధి ఉంది. సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. నలుగురిలో గొప్పపేరు సంపాదిస్తారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. మహాలక్ష్మి సందర్శనం శుభప్రదం.

మీనం

మీ మీ రంగాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మీ భుజాన కొత్త బాధ్యతలు పడతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే బాగుంటుంది.

ABOUT THE AUTHOR

...view details