తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (30-04-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

Horoscope Today (30-04-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
రాశి ఫలాలు

By

Published : Apr 30, 2022, 4:29 AM IST

Horoscope Today (30-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు; చైత్రమాసం; బహుళ పక్షం అమావాస్య: రా. 1.10 తదుపరి శుక్లపక్ష పాడ్యమి అశ్విని: రా. 7.47 తదుపరి భరణి వర్జ్యం: మ.3.37 నుంచి

5.17 వరకు అమృత ఘడియలు: మ.12.17 నుంచి 1.57 వరకు దుర్ముహూర్తం: ఉ. 5.39 నుంచి 7.19 వరకు

రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు

సూర్యోదయం: ఉ.5.39, సూర్యాస్తమయం: సా.6.14 సర్వ అమావాస్య

ప్రారంభించిన పనుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి, అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒక ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు. గురువుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది.

ప్రారంభించిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు,మిత్రుల సహకారం మేలు చేస్తుంది. నవగ్రహ స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన దైవానుగ్రహంతో వాటిని సమర్ధంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో సమర్ధంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు. సమాజంలో మంచి పేరుప్రఖ్యాతలు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం శుభప్రదం.

ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు,మిత్రుల వలన మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

మీ మీ రంగాలలో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా మారతాయి. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తిచేస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబసభ్యులకు మేలైన కాలం. దైవారాధన మానవద్దు.

విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనస్సౌఖ్యం ఉంది. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. సకాలంలో ఆదుకునేవారు ఉన్నారు. శివారాధన మంచిది.

ABOUT THE AUTHOR

...view details