Horoscope Today (24-04-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - గ్రహం అనుగ్రహం
Horoscope Today (24-04-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
Horoscope Today
By
Published : Apr 24, 2022, 6:36 AM IST
Horoscope Today (24-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం;
ఉత్తరాయణం; వసంత ఋతువు; చైత్రమాసం; బహుళ పక్షం;
సప్తమి; ఉ. 09.55 తదుపరి అష్టమి ; ఉత్తరాషాఢ రా. 11.43 తదుపరి శ్రవణం
అష్టమి: ఉ. 7.37 తదుపరి నవమి తె. 5.37 తదుపరి దశమి; శ్రవణం: రా. 8.45 తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: రా. 12.34 నుంచి 2.05 వరకు; అమృత ఘడియలు: ఉ.10.58 నుంచి 12.28 వరకు;
దుర్ముహూర్తం: సా.4.32 నుంచి 5.22 వరకు;
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
సూర్యోదయం: ఉ.5.42, సూర్యాస్తమయం: సా.6.13
ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్ని చేకూరుస్తాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తారు. అర్ధలాభం ఉంది. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి.
సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీ దర్శనం ఉత్తమం.
కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడక పోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
శుభకాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఒక వార్త ఆనందాన్నిఇస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం మంచిది.
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.
ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి
స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి.ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. దుర్గాధ్యానం వల్ల మేలు జరుగుతుంది.
ఏ పనిని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. అధికారులు సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. సూర్యారాధన శుభదాయకం.
మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. విరోధులను తక్కువ అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.
దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ,సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శని ధ్యానం శుభదాయకం.
ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక వ్యవహారంలో అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. ద్వాదశ చంద్రస్థితి అనుకూలంగా లేదు. చంద్ర ధ్యానం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.
శుభకాలం. అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శని శ్లోకాన్ని చదివితే మంచిది.