Horoscope Today (21-04-2022) ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - తెలుగు జాతకం
Horoscope Today (21-04-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
Horoscope Today
By
Published : Apr 21, 2022, 4:13 AM IST
Horoscope Today (21-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం;
ఉత్తరాయణం; వసంత ఋతువు; చైత్రమాసం; బహుళ పక్షం;
పంచమి; మ. 2.45 తదుపరి షష్ఠి; మూల రా. 1.21 తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం ఉ.10.27 నుంచి 11.56 వరకు అమృత ఘడియలు రా.7.23 నుంచి 8.53 వరకు,
దుర్ముహూర్తం: ఉ.09.53 నుంచి 10.43 వరకు తిరిగి మ.2.52 నుంచి 3.42 వరకు
రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం: ఉ.5.44, సూర్యాస్తమయం: సా.6.12
ప్రారంభించబోయే పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగం విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. ఎవరితోనూ అతిచనువు వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక విషయంలో ధైర్యంగా ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయాల్లో ఓర్పు అవసరం. శ్రీవిష్ణు ఆరాధన శుభప్రదం. సూర్య ఆరాధనతో మంచి చేకూరుతుంది.
శుభ సమయం. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులలోనూ దైవారాధన మానవద్దు.
మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ఉమా మహేశ్వర స్తోత్రం చదివితే మంచిది.
మంచి కాలం. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. కృష్టాష్టకం చదివితే బాగుంటుంది.
ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక ముఖ్య వ్యవహారం విషయమై పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధు,మిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్ధంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. విందు,వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.
కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
ప్రయత్న కార్యానుకూలత ఉంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. గతంలో ఆగిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. కుటుంబం సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.
మంచి కాలం. ప్రారంభించిన పనులను సజావుగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శివస్తోత్రం చదివితే బాగుంటుంది.