HOROSCOPE TODAY: ఈరోజు (నవంబర్ 8) మీ రాశిఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ఈ రోజు ఎవరి రాశి ఫలం
By
Published : Nov 8, 2022, 6:27 AM IST
|
Updated : Nov 8, 2022, 6:46 AM IST
HOROSCOPE TODAY: ఈరోజు (నవంబర్ 8) మీ రాశిఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
అంత అనుకూలమైన కాలం కాదు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లకపోతే పనులను పూర్తిచేయలేరు. జన్మరాశిలో నేడు పడుతున్న చంద్రగ్రహణం అధమ ఫలాన్ని ఇస్తోంది. పార్వతీ పరమేశ్వరులను పూజించడం మంచిది.
మనోబలంతో చేసే పనులు అనుకూలిస్తాయి. దైవారాధన వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది. ముఖ్య వ్యవహారంలో ముందు జాగ్రత్త అవసరం. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల మంచి జరుగుతుంది. వ్యయస్థానంలో నేడు పడుతున్న చంద్ర గ్రహణం అధమ ఫలాన్ని ఇస్తోంది. దుర్గాదేవిని ఆరాధించాలి.
ఊహించిన దానికన్నా గొప్ప ఫలితాలను పొందుతారు. సమయం చాలా విలువైనదిగా గుర్తిస్తారు. రక్తసంబంధీకులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఒక వార్త శక్తిని ఇస్తుంది. లాభ స్థానంలో నేడు పడుతున్న చంద్రగ్రహణం శుభఫలాన్ని ఇస్తోంది. ఇష్టదైవ నామాన్ని చదవాలి.
శుభకాలం. ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. దశమ స్థానంలో నేడు పడుతున్న చంద్ర గ్రహణం శుభఫలితాన్ని ఇస్తోంది. శివ నామస్మరణ మంచిది.
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. పెద్దల ఆశీర్వచనంతో చేసే పనులు ఫలిస్తాయి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. నవమ స్థానంలో నేడు పడుతున్న చంద్రగ్రహణం మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది. దుర్గా అష్టోత్తరం చదవాలి.
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శ్రమతో కూడిన ఫలితాలను అందుకుంటారు. కీలక విషయాల్లో బద్ధకించకూడదు. కొందరి ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. కొందరు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. అష్టమస్థానంలో నేడు పడుతున్న చంద్ర గ్రహణం అనుకూలించట్లేదు. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. శ్రీవేంకటేశ్వర స్వామి గోవింద నామాలు చదివితే మంచిది.
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. మనోధైర్యంతో విజయాలు సాధిస్తారు. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది. సప్తమ స్థానంలో నేడు పడుతున్న చంద్ర గ్రహణం మధ్యమ ఫలాన్ని ఇస్తోంది. లలితా సహస్రనామాలు చదవాలి.
అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. షష్ఠమ స్థానంలో నేడు పడుతున్న చంద్రగ్రహణం శుభ ఫలాన్ని ఇస్తోంది. ఇష్టదైవ స్తోత్రం చదివితే మంచిది.
మిశ్రమ వాతావరణం ఉంటుంది. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలను అందుకుంటాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. అభిప్రాయబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పంచమస్థానంలో నేడు పడుతున్న చంద్రగ్రహణం మధ్యమ ఫలాన్ని ఇస్తోంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలను రాబట్టడంలో ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. కుటుంబసభ్యుల మధ్య విబేధాలు రాకుండా చూసుకోవాలి. చతుర్థ స్థానంలో నేడు పడుతున్న చంద్రగ్రహణం అధమ ఫలాన్ని ఇస్తోంది. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన, దుర్గాస్తుతి మంచిది.
శుభకాలం.చక్కటి ప్రణాళికతో అనుకున్నది సాధిస్తారు. సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగండి,అనుకూలత లభిస్తుంది. కీలక పనులను ఈరోజు ప్రారంభించడం మంచిది. తృతీయ స్థానంలో నేడు పడుతున్న చంద్ర గ్రహణం శుభఫలితాన్ని ఇస్తోంది. ఇష్టదైవ నామస్మరణ ఉత్తమం.
మిశ్రమ కాలం. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు చేసేముందు పెద్దల అనుజ్ఞ తీసుకుని ముందుకు సాగితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ద్వితీయ స్థానంలో నేడు పడుతున్న చంద్ర గ్రహణం మధ్యమ ఫలాన్ని ఇస్తోంది. శివుణ్ణి ఆరాధించాలి.