Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈరోజు రాశిఫలాలు నవంబర్ 7 సోమవారం
HOROSCOPE TODAY: ఈరోజు (నవంబర్ 7) మీ రాశిఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horoscope today 7 november monday
By
Published : Nov 7, 2022, 6:27 AM IST
HOROSCOPE TODAY: ఈరోజు (నవంబర్ 7) మీ రాశిఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్లండి తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది అనిపించదు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.
శుభసమయం. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. దైవారాధనను ఎలాంటి పరిస్థితులలోనూ మానవద్దు.
మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ఉమామహేశ్వరస్తోత్రం పఠిస్తే మంచిది.
ప్రయత్నకార్యానుకూలత ఉంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. గతంలో ఆగిన పనులు మళ్ళి ప్రారంభం అవుతాయి. కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
మంచి కాలం. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. కృష్ణాష్టకం పఠిస్తే బాగుంటుంది.
మంచి కాలం. తల పెట్టిన పనులను సజావుగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలం. శివాస్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
మిశ్రమ ఫలితాలున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయాల్లో ఓర్పు అవసరం. శ్రీ విష్ణు ఆరాధన చేయడం మంచిది. సూర్య ఆరాధనా మంచినిస్తుంది.
చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధుమిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.
అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందూ, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాదన మానవద్దు. శివారాధన శుభప్రదం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆద్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.
పెద్దలనుండి ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుంది. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందగలుగుతారు.