తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today 5th October 2023 : ఆ రాశివారి రహస్యాలు ఇవాళ బయటపడే అవకాశం ఉంది.. జాగ్రత్త! - Horoscope Today in telugu

Horoscope Today 5th October 2023 : అక్టోబర్ 5న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today In Telugu
Horoscope Today 5th October 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 5:00 AM IST

Horoscope Today 5th October 2023 : అక్టోబర్ 5న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. సువర్ణావకాశం నేడు మీ ఇంటి తలుపు తట్టే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బాగా లాభపడతారు. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశివారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. అయితే కొత్త పనులు ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసర వివాదాల జోలికి వెళ్లకపోవడం మంచిది. శాంతంగా ఉండడం అలవర్చుకోవాలి. ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త!

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కట రాశివారికి మధ్యస్థంగా ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం వరకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. అయినప్పటికీ మీ కృషి, పట్టుదలతో మీ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. అయితే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

సింహం (Leo) :ఈ రోజు సింహ రాశివారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు మీపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ కారణంగా రోజంతా మీకు చికాకుగా ఉంటుంది. కుటుంబసభ్యులతో వాగ్వాదం, ఘర్షణ చెలరేగే అవకాశం ఉంది. ఇతరులతో ఘర్షణ పడే అవకాశాలు ఉన్నాయి. కనుక మౌనం వహించడం మంచిది.

కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అదృష్ట తారలు మీపై దృష్టి కేంద్రీకరించాయి. స్నేహితులు, బంధువులతో కలిసి హాయిగా గడుపుతారు. అయితే కొంత మేరకు మానసిక ఆందోళనలు చెలరేగే అవకాశం ఉంది. కనుక దైవ ప్రార్థన చేయడం మంచిది.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మీకు విజయం లభిస్తుంది. ఇతరుల మాట వినకుండా.. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా విజయం సాధిస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారికి శుభకరంగా ఉంటుంది. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మీరు చేపట్టే ప్రతి పనీ విజయవంతం అవుతుంది.

ధనుస్సు (Sagittarius) :ఈ రోజు ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ రహస్యాలు ఇవాళ బయటపడే అవకాశం ఉంది. అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీ ప్రేమ బంధం బలపడతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది.

మకరం (Capricorn) :ఈ రోజు మకర రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మీ ధోరణి వల్ల సమాజంలో మీ గౌరవ, ప్రతిష్టలకు భంగం కలిగే ప్రమాదం ఉంది. జాగ్రత్త!

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారికి అంతా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న పనులు అన్నీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి మధ్యస్థంగా ఉంటుంది. పనులు చేసీ బాగా అలసిపోతారు. అయితే మీ ఆప్త బంధువులను కలుసుకున్న తరువాత మరలా ఉల్లాసంగా, ఉత్సాహంగా తయారవుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details