తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today 4th October 2023 : ఈ రోజు ఆ రాశులవారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడండి! - Horoscope Today in telugu

Horoscope Today 4th October 2023 : అక్టోబర్ 4న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

horoscope-today-4th-october-2023-in-telugu-horoscope-today-telugu-2023
Horoscope Today in telugu

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 5:00 AM IST

Horoscope Today 4th October 2023 : అక్టోబర్ 4న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మీరు ఈ రోజు కాస్త బాధ్యతాయుతంగా ఉండాలి. కుటుంబ సభ్యుల అవసరాలు, కోరికలు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కోపం అదుపులో పెట్టుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసర వాదనల్లోకి వెళ్లకండి. అనవసర ఖర్చులు చేయకండి.

వృషభం (Taurus) :ఈ రోజు మీరు మీకు ధన లాభం చేకూరే మార్గాలు ఉన్నాయి. మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వినోద కార్యక్రమాల కోసం ఖర్చు చేసేందుకు వెనకాడకండి. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది.

మిథునం (Gemini) :ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు కోపం అదుపులో ఉంచుకోవాలి. పొరబాటు లేకుండా మాట్లాడాలి. లేదంటే వివాదాలు, అపార్థాలు రావచ్చు. ధ్యానం చేయండి. ఈ రోజు మీరు కంటి సమస్యతో బాధపడవచ్చు. ఖర్చులు తగ్గించేందుకు ప్రయత్నించండి. ఆధ్యాత్మికతతో నడుచుకోండి.

కర్కాటకం (Cancer) : ఈ రోజు మీకు బాగుటుంది. వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయి. డబ్బును సమకూర్చుకుంటారు. స్నేహితులను కలుసుకుంటారు. పెళ్లి కావాలిసినవారు వివాహ సంబంధాలు చూడొచ్చు. త్వరలోనే మీరు కోరుకున్న వ్యక్తి దొరుకుతారు. పిక్నిక్​ వెళ్లేందుకు ప్రయత్నించండి.

సింహం (Leo) :విశ్వాసం, దృఢ నిశ్చయంతో ఉండండి. పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. మంచి ఫలితాలు ఉండొచ్చు. ఆస్తికి విషయంలో సానుకూల అంశాలు ఉంటాయి. ఈ రోజు ప్రభుత్వ విషయాలకు సంబంధించి, ఆర్థిక సంబంధమైన డాక్యుమెంట్లు చూడడానికి మంచి రోజు.

కన్య (Virgo) :ఈ రోజు మీకు బాగుంటుంది. ధ్యానం ధార్మిక కార్యక్రమాలతో ఈ రోజు మొదలు పెట్టండి. మీకు అంతా మంచే జరుగుతుంది. మిత్రులు, సన్నిహితులతో సహకారం లభించవచ్చు. విదేశాలలో ఉన్న మిత్రుల నుంచి సమాచారం అందుతుంది. సంతోషం, సరదా, ఈ రోజంతా సంతోషంతో సరదాగా గడుస్తుంది.

తుల (Libra) : ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కోపాన్ని తగ్గించుకోండి. జాగ్రత్తగా మాట్లాడండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించండి. అనైతిక, చట్ట విరుద్ధమైన పనులు చెయ్యకండి. ఆర్థిక పరమైన కార్యక్రమాలపై జాగ్రత్తగా వ్యవహరించండి.

వృశ్చికం (Scorpio) :ఈ రోజు మీరు సరదా, సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లండి. సినిమాకు వెళ్లండి. డిన్నర్​కు ప్లాన్​ చేయండి. సామాజిక సేవా కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

ధనుస్సు (Sagittarius) :ఈ రోజు మీకు బాగుంటుంది. ఆరోగ్యం, సంపద బాగానే ఉంటుంది. ఇంటి వాతావరణంలో సమన్వయ ధోరణి ఉంటుంది. రోజంతా చురుగ్గా వ్యవహరిస్తారు. సహోద్యుగులకు సహకరించండి. ఆర్థికపరంగా మంచి ఫలితాలే ఉంటాయి.

మకరం (Capricorn) :ఈ రోజు అనారోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. కాస్త గాభరాగా ఉంటారు. నిర్ణయం తీసుకునే శక్తి కొరవడుతుంది. ఈ రోజు మీకు అంతగా బాగుండదు. మీ పిల్లల ఆరోగ్యం జాగ్రత్త. ప్రాణాయామం చెయ్యండి. విశ్రాంతి తీసుకోండి.

కుంభం (Aquarius) : ఈ రోజు మీకు సాధారణంగానే ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో మీ సమయం సాఫీగా సాగదు. సామాజికంగా మీ పరపతి దెబ్బతినే పనులు చెయ్యవద్దు. మీ ఇల్లు, ఆస్తి వంటి నిర్ణయాలపై జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ఆర్థికపరంగానూ బాగానే ఉంటుంది.

మీనం (Pisces) : ఈ రోజు మీనరాశి వారు కష్టపడి పనిచేయండి. మీ సృజనాత్మకత మీకు పేరు తెచ్చిపెడుతుంది. నూతన దృక్పథాన్ని చూపిస్తారు. తగిన నిర్ణయాలు తీసుకుని వాటిని త్వరలోనే అమలు చేస్తారు. పనులు పూర్తి చేస్తారు. టూర్​కు వెళ్లిరండి. సమాజంలో తగినంత గుర్తింపు వస్తుంది.

ABOUT THE AUTHOR

...view details