తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today 30th August 2023 : ఆ రాశివారికి ఈ రోజు లీగల్ సమస్యలు పరిష్కారమవుతాయి! - Horoscope Today In Telugu Etv Bharat

Horoscope Today 30th August 2023 : ఆగస్టు 30న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 30th August 2023 In Telugu
Horoscope Today 2023 30th August

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 4:59 AM IST

Horoscope Today 30th August 2023 :ఆగస్టు 30న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈరోజంతా మీకు వాదనలతోనే సరిపోతుంది. దూకుడును ప్రదర్శిస్తారు. స్నేహితులతో కలిసి వ్యాపారపరమైన చర్చల్లో పాల్గొంటారు. సాయంత్రం మీ ఆత్మబంధువు నుంచి అందే ప్రత్యేక ఆతిథ్యంతో మీరు మురిసిపోతారు.

వృషభం (Taurus) : ఈరోజు సమస్యలను పరిష్కరించడం మీకు చాలా కఠినంగా అనిపిస్తుంది. అయినా కొంత సమయం తీసుకొని వాటిని మీరు పరిష్కరిస్తారు. ఈ విషయంలో నిరాశ పడకండి. కఠిన శ్రమ, సహనం మంచి ఫలితాల్ని ఇస్తాయి. వీటిని ఆకళింపు చేసుకోండి. దీంతో మీలో విషయాన్ని అర్థం చేసుకొని శక్తి పెరుగుతుంది. మీ ప్రియమైన వ్యక్తిని ఈరోజుకు షాపింగ్​కు తీసుకెళ్తారు.

మిథునం (Gemini) : ఈరోజంతా చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. మధ్యాహ్న సమయంలో మీ వ్యాపార భాగస్వాములతో గడుపుతారు. మీ దూకుడును నియంత్రణలో పెట్టుకోండి. అప్పుడే ఓ ముఖ్యమైన డీల్​ను సొంతం చేసుకోగలరు. సాయంత్రం చాలా సరాదాగా ఉంటారు. మీ భాగస్వామితో కలిసి ఊహాల్లో విహరిస్తారు.

కర్కాటకం (Cancer) : ఈరోజు మీరు మీ సిద్ధాంతాలతో అస్సలు రాజీపడరు. దీంతో మీరు చాలా సంతృప్తి చెందుతారు. అందుకని రాజీపడే ధోరణిని విడవకండి. అది మీ వృత్తిపరమైన వ్యవహారాల్లో ఎంతో సహాయపడుతుంది.

సింహం (Leo) : కొన్ని విషయాలు ఈరోజు మీకు చికాకు కలిగిస్తాయి. దీంతో మీలోని కోపాన్ని ప్రదర్శిస్తారు. మీ వ్యక్తిత్వాన్ని మెరుగు పరుచుకునేందుకు ఏదో ఒక కోర్సులో చేరే సూచనలున్నాయి. మీరు జరిపే ఓ సన్నిహిత సంభాషణ మీ మనస్సును హత్తుకుంటుంది.

కన్య (Virgo) :పాత జ్ఞాపకాలను ఈరోజు మీరు నెమరువేసుకుంటారు. అందులోని మధురమైన క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటారు. భావసారూప్య వ్యక్తులతో కలిసి మీ ఆలోచనలను పంచుకుంటారు. అలాగే ఆధ్యాత్మికమైన విషయాలను వారితో చర్చిస్తారు. గత అనుభవాలను మర్చిపోయి వర్తమానంపై దృష్టి సారించి ముందుకు సాగండి. ప్రతిఫలం ఉంటుంది.

తుల (Libra) : ఎన్నో ఆశ్చర్యాలను ఈరోజు మీరు చూస్తారు. ఆ రహస్యాలన్నీ ఒక్కొక్కటిగా బహిర్గతం చేయాల్సిన సమయం కూడా ఇదే. వృత్తిపరమైన, వ్యాపారపరమైన చర్చల్లో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ఈరోజు సరదాగా గడుపుతారు. మీ చుట్టూ ఉండేవారిని ఆకట్టుకుంటారు.

వృశ్చికం (Scorpio) :మీ ప్రియమైన వ్యక్తి మీపై చూపించే ప్రేమతో ఈరోజు వారి వశమవుతారు మీరు. ఊహల్లో విహరిస్తారు. విపరీతంగా ఖర్చులు చేస్తారు. మీ స్నేహితులతో కలిసి ఇవాళ షాపింగ్​కు వెళ్తారు.

ధనుస్సు (Sagittarius) : గతంలో చేసిన పొరపాట్ల గురించి ఈరోజు మీరు ఆలోచిస్తుంటారు. వృత్తిపరంగా మీ టీమ్​ విజయంలో కీలక పాత్ర పోషిస్తారు. అయితే ఎంత కష్టపడినా మీ శ్రమను ఎవరూ గుర్తించరు. ఇది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. అయినా బాధపడకండి. అలాగే ముందుకు సాగండి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంది. చికాకులు, ఆహ్లాదంతో మీ ఈరోజు గడుస్తుంది. మీ స్నేహితులతో సరదాగా గుడుపుతారు. వారితో కలిసి విలువలు, ఆధ్యాత్మిక విషయాలు, రజకీయాల గురించి చర్చిస్తారు. మీ భాగస్వామితో కలిసి రెస్టారెంట్​లో లేదా బీచ్​లో హాయిగా గడుపుతారు.

కుంభం (Aquarius) : భౌతిక స్థితుల నుంచి ఆధ్యాత్మిక స్థితుల వైపు ఈరోజు మీరు ప్రయాణిస్తారు. ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలకు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. చట్టపరమైన వ్యవహారాలను ఓ కొలిక్కి తెచ్చుకుంటారు. మీరు చెప్పట్టే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి.

మీనం (Pisces) :వేగవంతమైన నిర్ణయాలు ఈరోజు మీరు తీసుకుంటారు. అందుకే మానసిక స్థైర్యాన్ని మెరుగుపరుచుకోండి. మీరు తీసుకునే నిర్ణయాల ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. ఆర్థికపరమైన అంశాలు కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

ABOUT THE AUTHOR

...view details