తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today 2nd October 2023 : ఈ రాశివారు అప్పులు జోలికి వెళ్లకండి! - Horoscope Today in telugu

Horoscope Today 2nd October 2023 : అక్టోబర్ 2న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

horoscope-today-2nd-october-2023-in-telugu-horoscope-today-telugu-2023
ఈ రోజు రాశిఫలాలు

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 4:06 AM IST

Horoscope Today 2nd October 2023 : అక్టోబర్ 2న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : ఈ రోజు మీరు దూకుడుకుగా ఉంటారు. దాన్ని కాస్త నియంత్రణలో ఉంచుకోవాలి. కొత్త ప్రయత్నాలు, పనులు ఈ రోజు చేపట్టకండి. చక్కగా మాట్లాడండి.

వృషభం (Taurus) :అన్నికోణాలూ పరిశీలించాకే ఓ నిర్ణయానికి రండి. పార్టనర్లు మీ అభిప్రాయాన్ని పాటించకపోవచ్చు. ఈ రోజు మీకు అంతగా బాగుండదు. మీరు మానసికంగా చాలా ఆలోచిస్తారు. అది మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. మీ ప్రయత్నాలకు మెప్పు, ప్రశంసలు ఉండవు. ఖర్చులు అధికం అవుతాయి. మీ ప్రియమైన వారినీ, బిజినెస్ పార్ట్నర్స్​ని తిరిగి మంచి చేసుకోవాలి.

మిథునం (Gemini) :ఈరోజు మీకు బాగుంటుంది. అదృష్టం కలిసివస్తుంది. అన్నీ కోణాల్లోనూ ప్రయోజనాలు కలుగుతాయి. మీకు సాయం వారితో కృతజ్ఞత భావంతో మెలగండి.

కర్కాటకం (Cancer) : కుటుంబంలోని చిన్నవారిపై మీరు అధిక శ్రద్ధ పెడతారు. వారికి తగిన సూచనలు అందిస్తారు. వేడుకలకు మంచి సమయం. పోటీలు లేదంటే ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాలనే కోరిక కలుగుతుంది.

సింహం (Leo) :ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీరు కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అన్నింటిని తట్టుకొని నిలబడండి.

కన్య (Virgo) :ఈరోజు కాస్త కొత్తగా ప్రారంభమవుతుంది. మీరు ఎంత కాలం నుంచో చేసుకున్న ప్రణాళికలు అన్నీ ఇప్పుడు అమలుపరచవచ్చు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.

తుల (Libra) : ఈ రోజు సరదాగా, సంతోషంగా గడుస్తుంది. మీరు మీ పాత స్నేహితులను కలుసుకునే ప్రణాళికలో ఉంటారు. సినిమాకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. అభరణాలు కొనే సూచనలు ఉన్నాయి.

వృశ్చికం (Scorpio) :ఈ రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడుపుతారు. మీ ఇంటి నుంచి మంచి విషయం వింటారు. పనులు పూర్తి చేసేందుకు మంచి వాతావరణం ఏర్పడుతుంది. పూర్తి కానీ పనులు ఈ రోజు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది.

ధనుస్సు (Sagittarius) :మీకు మానసికంగా అస్థిరత ఉంటుంది. మీరు జీర్ణసంబంధ రోగాలకు తీసుకునే మందులపై జాగ్రత్త వహించండి. ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండండి.

మకరం (Capricorn) :ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. కుటుంబ సమస్యలు వేధించవచ్చు. మీకు ఇష్టమైన వారితో గొడవ పడే అవకాశం ఉంది. మహిళలతో జాగ్రత్తగా వ్యవహరించండి. నీటికి దూరంగా ఉండండి. కాస్త ఆందోళనలోనే గడుపుతారు.

కుంభం (Aquarius) : మీరు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆందోళనలను తొలగించండి. విహారయాత్రను వెళ్లే సూచనలు ఉన్నాయి. స్నేహితులను, ప్రియమైన వారిని కలిసే అవకాశం ఉంది.

మీనం (Pisces) :జాగ్రత్తగా మాట్లాడండి. ఖర్చులపై కాస్త జాగ్రత్త వహించండి. అప్పులు చేయకండి, ఇవ్వకండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆహారం విషయంలా జాగ్రత్త వహించండి.

ABOUT THE AUTHOR

...view details