Horoscope Today 29th August 2023 :ఆగస్టు 29న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :వృత్తిపరంగా మీ పైఅధికారులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. ప్రభుత్వం నుంచి మీ ప్రాజెక్టులకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించిన పర్యటనలు మిమ్మల్ని వివిధ ప్రదేశాలను చూసేలా చేస్తాయి. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
వృషభం (Taurus) : మీ తారాబలం అనుకూలంగా ఉంది. ఎంతోకాలంగా తీర్థయాత్రలు, దూర ప్రదేశాలకు వెళ్లాలనే మీ కోరిక ఈరోజు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్శనలు మీలో కొత్త ప్రేరణను నింపుతాయి. ఏదైనా కొత్త వెంచర్లో పెట్టుబడి పెట్టడానికి, ప్రారంభించడానికి ఇది మంచి సమయం. విదేశాల్లో ఉన్న మీ ప్రియమైనవారి నుంచి శుభవార్త వింటారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.
మిథునం (Gemini) : ఈరోజు కొంత అశాంతిగా ఉంటారు. ఆస్తి సంబంధమైన సమస్యలతో ఆందోళనకు గురవుతారు. చిన్న చిన్న విషయాలును కూడా మనసుకు తీసుకోని బాధపడతారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత సాహసం చేస్తారు.
కర్కాటకం (Cancer) : కర్కాటక రాశివారికి తారాబలం అనుకూలంగా ఉండటం వల్ల ఈరోజు అద్భుతంగా గడుస్తుంది. రోజంతా సరదాగా గడుపుతారు. ప్రేమ సంబంధాలు, విభిన్న రకాల సరదాలకు తెర తీస్తారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన ఓ ఆసక్తికరమైన వ్యక్తిని మీరు ఈరోజు కలుస్తారు. దీంతో మీరు సంతృప్తి చెందుతారు. మీ ఇద్దరి కలయిక వలన ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపారం, ఉద్యోగంలో విజయం సాధిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. పరువు ప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
సింహం (Leo) : ఈరోజు మీ తారాబలం మిశ్రమంగా ఉంది. ఇంట్లోని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి మంచి సహకారం అందుతుంది. పనులను పూర్తి చేసే సమయంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. పుట్టింటి నుంచి ఒక చేదు వార్తను వింటారు. లేదా పనిదగ్గర మీ ప్రత్యర్థులు సృష్టించిన కొన్ని ఆటంకాలు మిమ్మల్ని చికాకుకు గురిచేస్తాయి. ఆందోళనకు గురవుతారు. మీ పైఅధికారులతో, ఇంటి పెద్దలతో వాదనలకు దిగకండి. సమస్యలను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి.
కన్య (Virgo) :ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పిల్లలు, ప్రియమైన వారి గురించి ఆలోచించి మానసికంగా ఆందోళన చెందుతారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఉదరం లేదా లివర్ సంబంధిత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వ్యాయామం చేయండి. ఈ సంఘర్షణలో మీ సృజనాత్మకత మీకు సహకరిస్తుంది. ఖర్చులు ఉన్నాయి. మీ ప్రియమైన వారితో లేదా మీ సన్నిహిత మిత్రులతో ఓపెన్‌గా మూవ్ అవ్వండి. ఇది మీ మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. గంభీరమైన విషయాల గురించి చర్చించకండి. స్టాక్మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.
తుల (Libra) : ఒక విషయంలో మానసికంగా విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. భావోద్వేగానికి లోనవుతారు. వైవాహిక జీవితం అసంతృప్తిగా ఉండవచ్చు. లేదా మీ అమ్మగారితో గానీ ఓ యువతితో గానీ మనస్ఫర్థలు ఏర్పడతాయి. ప్రాణాయామం చేయండి. ఈరోజు మీకు జలగండం ఉంది. జలాశయాలకు, స్విమ్మింగ్ పూల్స్‌కు దూరంగా ఉండండి. ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఆస్తి, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.
వృశ్చికం (Scorpio) :వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంది. ఈరోజు తారాబలం మీకు అనుకూలంగా లేకపోవడం కారణంగా కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. అయినప్పటికీ ధైర్యంతో ముందడుగు వేసి మీ కొత్త ప్రోడక్ట్‌ను లాంఛ్ చేయండి. మీరు ఆవిష్కరించే కొత్త ఉత్పత్తి మీ ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తాయి.
ధనుస్సు (Sagittarius) : ఈరోజు మీరు గందరగోళంలో గడుపుతారు. మీ కుటుంబ వాతావరణం అస్థిరంగా ఉండవచ్చు. సాధారణమైన పనులు పూర్తిచేయలేరు. దీంతో నిరుత్సాహానికి లోనపుతారు. ముఖ్యమైన నిర్ణయాలను ఈరోజు తీసుకోకపోవడం మంచిది. వృత్తిపరమైన, గృహ సంబంధిత వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు.
మకరం (Capricorn) :మీ వైవాహిక జీవితంలో, కుటుంబం విషయంలో లేదా పనిచేసే చోట ఉన్నతంగా ఉండేందుకు ప్రయత్నించండి. వ్యాపార రంగంలో ఉన్నవారికి, ఉద్యోగం చేసేవారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రణాళిక పరంగా నడుచుకుంటే ఉద్యోగంలో ఆశించినంత లాభాన్ని పొందుతారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సాయంత్రం మీ ఇష్టమైన వారితో లేదా మీ స్నేహితులతో సరదాగా సినిమాకి లేదా డిన్నర్‌కు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం (Aquarius) : ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. సరిపడా విశ్రాంతి లేకపోవడం వల్ల మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. కోర్టు వ్యవహారాలు వేగంగా సాగేలా చూసుకోండి. లాభం ఉన్న చోటే పెట్టుబడులు పెట్టండి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మాటలను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేదంటే మీకు కావాల్సిన వారు కూడా మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు.
మీనం (Pisces) :ఈరోజు మీ మీద పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మీ ప్రత్యర్థులను వెనక్కి నెట్టడంలో మీరు అస్సలు తగ్గరు. ఇతరుల అవసరాలపై మీరు సానుకూలంగా ఉన్నప్పటికీ అవసరమైన సందర్భాల్లో మీరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. జనం మీ గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటారు. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. అంతా మంచే జరుగుతుంది.