తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాశివారికి ఆదివారం అదృష్టం వరించే అవకాశం- ఆర్థికంగా లాభపడతారు! - తెలుగు రాశి ఫలాలు మీన రాశి

Horoscope Today 26th November 2023 : నవంబర్​ 26న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today In Telugu
Horoscope Today 26th November 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 4:45 AM IST

Horoscope Today 26th November 2023 :నవంబర్​ 26న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి చాలా బాగుంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మాతృ సంబంధమైన లబ్ధి చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశివారికి అంత ఆశాజనకంగా ఉండదు. అన్ని రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీకు ఇష్టమైన వ్యక్తులతోనే విబేధాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఏ పనులనూ పూర్తి చేయలేకపోవచ్చు. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు. ఆచరణ సాధ్యం కాని పనుల జోలికి వెళ్లకూడదు. లేకుండా ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారికి బాగుంటుంది. మీ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారి భవిష్యత్ కోసం ప్రణాళికలు వేస్తారు. పోటీల్లో పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా గడుపుతారు.

సింహం (Leo) :ఈ రోజు సింహ రాశివారికి సాధారణంగా గడుస్తుంది. కోరుకున్న ఫలితాలు అంత సులువుగా లభించవు. అనేక అడ్డంకులు ఏర్పడతాయి. కానీ పట్టుదలతో కృషి చేస్తే, వాటన్నింటినీ అధిగమించవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త!

కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారు సంతోషంగా గడుపుతారు. సౌందర్య సాధనాలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా లాభపడతారు. మొత్తంగా చూసుకుంటే.. ఇవాళ కన్య రాశివారు చాలా బాగుంటారు.

తుల (Libra) :ఈ రోజు తుల రాశివారు చాలా దూకుడుగా ఉండే అవకాశం ఉంది. అయితే అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. లేదంటే ఇబ్బంది పడతారు. దైవ ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారికి అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా లాభపడతారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతున్న పనులు.. ఇవాళ పూర్తి చేస్తారు. మంచి శుభవార్తలు వింటారు.

ధనుస్సు (Sagittarius) :ఈ రోజు ధనుస్సు రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కలహాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మీ పిల్లల విషయంలో వ్యాకులతకు గురయ్యే అవకాశం ఉంది. వీలైతే ప్రయాణాలు వాయిదా వేయండి. అపజయాలకు కృంగిపోవద్దు. మంచి కాలం ముందుంది.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి ఏ మాత్రం బాగుండదు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కుటుంబంలో గొడవలు చెలరేగవచ్చు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. స్త్రీలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటికి దూరంగా ఉండాలి.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభరాశివారికి చాలా బాగుంటుంది. అన్ని పనులను చాలా ఉత్సాహంతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. త్వరలోనే అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మీనం (Pisces) :ఈ రోజు మీన రాశివారికి అనవసర ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఇవాళ మీరు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

ABOUT THE AUTHOR

...view details