Horoscope Today 1st September 2023 : సెప్టెంబర్ 1న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేష రాశివారు ఈ రోజుఆర్థికపరమైన ప్రయోజనాలు పొందగలరు. సమాజంలో మీ గౌరవం, కీర్తి పెరుగుతాయి. మీ వ్యాపారం బాగా రాణిస్తుంది. జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. త్వరలోనే అభివృద్ధి పనులు పూర్తి చేస్తారు.
వృషభం (Taurus) :వృషభ రాశివారికి వ్యాపారపరంగా ఇది అద్బుతమైన రోజు. మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. ఇది మీకు పేరు, ప్రఖ్యాతులతో పాటు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తుంది. నేడు మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులతో గొడవ పడకూడదు. మనస్పర్థలు వచ్చినా రాజీపడేందుకు ప్రయత్నించడం మంచిది. ఈ రోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
కర్కాటకం (Cancer) : ఈ రోజు మీ అదృష్టతారలు దోబూచులాడుతున్నాయి. కనుక పనుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు, మీ కుటుంబానికి చెడ్డపేరు తెచ్చే అక్రమ, అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండడం మంచిది. పరుషంగా మాట్లాడి.. ఇతరులకు బాధ కలిగించవద్దు.
సింహం (Leo) : ఈ రోజు మీరు మానసికంగా, శారీరకంగా కూడా సంతోషంగా ఉంటారు. ఇది స్నేహితులు, బంధువులతో సరదాగా గడపుతారు. వ్యాపారం కలిసి వస్తుంది. మీరు, మీ భాగస్వాములతో కలిసి మంచి ఒప్పందం కుదుర్చుకుంటారు.
కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశి వారికి కలిసివస్తుంది. మీరు మీ వ్యాపార భాగస్వాముల నుంచి ప్రయోజనం పొందుతారు. మీరు మీ పనిని విజయవంతంగా పూర్తి చేసి.. ఉల్లాసభరితంగా ఉంటారు. సాయంత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
తుల (Libra) : దీర్ఘకాలిక, స్థిరాస్తి పెట్టుబడులకు ఇది మంచి రోజు. దీని వల్ల భవిష్యత్లో మంచి ప్రయోజనాలు, లాభాలు పొందుతారు. ఈ రోజు మీరు ఆనందంగా గడుపుతారు. అవకాశాలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే.. మీకు మంచి జరుగుతుంది.
వృశ్చికం (Scorpio) : మీరు ఈ రోజు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మానసిక ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి.
ధనుస్సు (Sagittarius) :ఈ రాశి వారు అతిగా ఆవేశపడకుండా జాగ్రత వహించాలి. ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణం చేయకపోవడం మంచిది. మీరు సామరస్యపూర్వకంగా మెలుగితేనే.. ఇతరుల నుంచి మన్నన పొందగలుగుతారు.
మకరం (Capricorn) :మీ రోజు మీరు సరైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటే.. అది మీకు కలిసివస్తుంది. మీరు ఈ రోజు అన్నింటిలోనూ విజయాన్ని అందుకుంటారు. కష్టపడి మీరు సాధించిన దానికి.. మీ శ్రేయోభిలాషుల నుంచి ప్రశంసలు వస్తాయి. ఈ రోజు మీరు స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు.
కుంభం (Aquarius) : ఈ రోజు కంభ రాశివారికి సాధారణంగా ఉంటుంది. మీరు ఈ రోజు ఆధ్యాత్మిక చింతన చేయడం మంచిది. అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు ప్రతికూలమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీ ఆత్మవిశ్వాసం నీరుగారుతుంది.
మీనం (Pisces) :ఈ రోజు మీరు మంచి ఫలాలను పొందడానికి.. మీ శక్తులను సానుకూలమైన మార్గంలో వినియోగించుకోవాలి. మీరు ధ్యానం, యోగా సాధన చేయడం మంచిది. మీ కుటుంబ సభ్యులతో, ప్రియమైనవారితో వాగ్వివాదాలకు అవకాశం ఉంది. కనుక ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.