తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today 16th October 2023 : ఆ రాశి వారు కోపాన్ని కంట్రోల్​ చేసుకోవాల్సిందే.. లేదంటే సమస్యలు తప్పవ్​! - Horoscope Today in telugu

Horoscope Today 16th October 2023 : అక్టోబర్ 16న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 16th October 2023
Horoscope Today 16th October 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 5:03 AM IST

Horoscope Today 16th October 2023 :అక్టోబర్ 16న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. అందరి నుంచి పొగడ్తలు, ప్రశంసలు పొందుతారు. మేథోపరమైన చర్చల్లో పాల్గొంటారు. అయితే మాటలు అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి అంత అనుకూలంగా లేదు. అనవసర ఆందోళనకు గురవుతారు. అయితే పనుల విషయంలో అశ్రద్ధ వహించకండి. దైవ ప్రార్థన వల్ల మానసిక స్థిరత్వం, ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

మిథునం (Gemini) :ఈ రోజు మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం ముఖ్యం. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ఒడుదొడుకుల వల్ల మానసికంగా ఇబ్బంది కలగవచ్చు. ఇష్ట దైవాన్ని ప్రార్థించండి అంతా మంచే జరుగుతుంది.

కర్కాటకం (Cancer) :ప్రతికూల పరిస్థితులు ఈ రోజు మిమ్మల్ని వెంటాడతాయి. మానసికస్థితి చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు చేసే తప్పులు మిమ్మల్నే ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు ఏర్పడవచ్చు. ఈ రోజు డబ్బులు పోగొట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అన్నింటినీ ఓర్పుతో భరించండి.

సింహం (Leo) :మీ సన్నిహితులతో సంబంధాలు బాగుంటాయి. మీ ప్రియమైన వారితో లేదా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లే సూచనలు ఉన్నాయి. మీ ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థికంగా లాభాలు పొందవచ్చు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్త్రీ అదృష్టం మీకు ఈ రోజు కలిసివస్తుంది. నూతన పనులు చేపట్టడానికి ఈ రోజు శుభప్రదంగా ఉంది.

కన్య (Virgo) :ఈ రోజు మంగళకరమైన రోజు. మీ మాటలతో మీ చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటారు. మీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మీ కుటుంబ సభ్యులతో శాంతంగా ఉండవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాలను బాగానే నిర్వహిస్తారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. మీ స్నేహితులతో లేదా మీకు నచ్చిన వారితో ఏదైనా ప్రదేశాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయి.

తుల (Libra) : ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆర్థిక విషయాలను బాగానే నిర్వహిస్తారు. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. షాపింగ్​, సరదాలు వంటి వాటి కోసం ఖర్చులు చేస్తారు. సృజనాత్మకత కూడిన కార్యక్రమాల్లో ఈ రోజు మీరు పాల్గొంటారని ఫలితాలు చెబుతున్నాయి.

వృశ్చికం (Scorpio) : సమస్యలు ఈ రోజు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. లేదంటే గొడవలకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వినోద కార్యక్రమాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. సన్నిహితులు, ప్రియమైన వారితో అపోహలు ఏర్పడతాయి.

ధనుస్సు (Sagittarius) :ఈ రోజు మీకు లాభదాయకమైన రోజు. మీ కుటుంబ జీవితాన్ని ఈ రోజు మీరు సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి చిన్న ట్రిప్​నకు వెళ్తారు. మీ ఆదాయంలో పెరుగుదల ఉందని గ్రహస్థితి చెబుతోంది. మీకు నచ్చిన ఆహారాన్ని ఈ రోజు మీరు భుజిస్తారు.

మకరం (Capricorn) : మీ వ్యాపారం లాభసాటిగా ఉండకపోవచ్చు. ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. చిన్న రోడ్డు ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రమాదకరమైన వ్యవహారాలు, సందర్భాలకు దూరంగా ఉండటం మంచిది. మరోవైపు ఈ రోజు కొంత సానుకూలత కూడా మీకు గోచరిస్తోంది. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలను వాయిదా వేసుకోవటం ఉత్తమం. దీని ద్వారా దీర్ఘకాలంలో మీరు ప్రయోజనం పొందుతారు.

కుంభం (Aquarius) :ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. దీంతో మీరు చికాకు చెందుతారు. అయితే ఇది మీ పనులకు ఎటువంటి ఆటంకం కలిగించదు. ఈ రోజు పూర్తిగా మీరు పనిలో నిమగ్నమైపోతారు. అయితే మీ పనిపట్ల మీ ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేయవచ్చు. బహుశా మీ అనారోగ్యం కారణంగా మీకు అప్పగించిన పనులను అంత సమర్థవంతంగా చేయలేకపోవచ్చు.

మీనం (Pisces) : అనైతికమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. లేదంటే ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత అవసరం. ప్రతికూల ఆలోచనలు మీ మెదడులో, మనసులో రానివ్వకండి. ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతిస్తుంది. వైద్య ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాన గుణం, దైవ చింతన కలిగి ఉండటం మీకు మేలు చేస్తాయి.

ABOUT THE AUTHOR

...view details