Horoscope Today (13-04-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - శుభముహూర్తం
Horoscope Today (13-04-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
horoscope
By
Published : Apr 13, 2022, 3:28 AM IST
Horoscope Today (13-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
అనుభవజ్ఞులు సూచించిన మార్గంలో ముందుకు సాగండి. మంచి చేకూరుతుంది. ధనలాభం కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.
మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ప్రారంభించిన పనులను పూర్తిచేయడంలో ఇబ్బందులు ఎదురైనా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. ఒకరి ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది. సూర్యాష్టకం చదివితే ఇంకా బాగుంటుంది.
ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మనః స్సౌఖ్యం కలదు. ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవాలి.
చేసే పనిలో మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన కొన్ని ఫలితాలను పొందడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. శారీరక సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆదిత్య హృదయం చదవాలి.
బుద్ధిబలం బాగుంటుంది. కీలక భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొత్త ఆలోచనలు చేసి వాటిని ఆచరణలో పెడతారు. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. బంధు,మిత్రులను ఆదరిస్తారు. శుభవార్తలు వింటారు. పెద్దల ఆశీస్సులు అండదండలు లభిస్తాయి. ఇష్టదేవతా నామస్మరణ మంచిది.
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. బంధు,మిత్రులను కలుపుకొనిపోవాలి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత కోసం దైవచింతన అవసరం అవుతుంది. సూర్య ఆరాధన చేస్తే మంచిది.
ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక వ్యవహారంలో ఊహించని ఫలితాలు వస్తాయి. అవి మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మహాలక్ష్మిని ఆరాధించాలి.
గొప్ప కాలం. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్ధికంగా కొన్నివ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీ రామ దర్శనం ఉత్తమం.
ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అపరిచితులతో జాగ్రత్త. లక్ష్మీస్తోత్రం చదివితే మంచిది.
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకండి. అనవసర కలహాలతో సమయం వృథా చేసుకోకండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చంద్రధ్యానం చేసుకుంటే మంచిది.
స్థిర నిర్ణయాల వల్ల మంచి జరుగుతుంది. ఆర్ధికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అధికారులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. దుర్గాస్తుతి వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని పెంచేలా ఉంటాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. సూర్యభగవానుని సందర్శనం ఉత్తమం.