Horoscope Today 12th August 2023 : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - Horoscope Today 12th August 2023
Horoscope Today 12th August 2023 In Telugu : ఈ రోజు (ఆగస్టు 12) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
Horoscope Today 12th August 2023
By
Published : Aug 12, 2023, 6:24 AM IST
Horoscope Today 12th August 2023 : ఈ రోజు (ఆగస్టు 12) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
ఈ రోజు ప్రయోజకరంగా ఉంటుంది. కానీ మానసికంగా చికాకుతో ఉంటారు. దీంతో పెద్ద విషయాలకు సంబంధించి దృఢ నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ముఖ్యమైన నిర్ణయాలను పక్కనపెట్టడం మంచిది. వృత్తికి సంబంధించి ఏవైనా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ రోజు మీరు మౌనంగా, ప్రశాంతంగా ఉండటం మంచిది. గందరగోళం, నిర్ణయాల్లో అనిశ్చిత కారణంగా మంచి అవకాశాలను మీరు కోల్పోవచ్చు. రాజీపూర్వక ధోరణి, సర్దుకుపోయే తత్వంతో ఉండేందుకు ప్రయత్నించండి. ప్రయాణాలను వాయిదా వేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ రోజు ఆర్థికంగా ప్రయోజనం పొందే సూచనలు ఉన్నాయి. మీ స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు. మీకు నచ్చిన ఆహారాన్ని తింటారు. నచ్చిన బట్టలు వేసుకుంటారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనవసర ఖర్చుల జోలికి పోకపోవడం మంచిది.
ఈ రోజు మీరు గందరగోళంగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకుంటే మంచిది. మీ కుటుంబసభ్యులు మీకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఖర్చు చేస్తారు. మాటలు నియంత్రణలో పెట్టుకోండి. అపార్థాలను తొలగించుకునే ప్రయత్నం చేయండి.
ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులు మీ పట్ల దయ కలిగి ఉంటారు. అందమైన ప్రదేశానికి వెళ్లే సూచనలు ఉన్నాయి. కానీ మీరు జాప్యం చేస్తే ఆ అవకాశం మీ చేజారిపోతుంది.
ఈ రోజు మీపై దైవబలం చక్కగా ఉంటుంది. ఇవాల ప్రారంభించే పనులు, కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వృత్తినిపుణులు, ఆఫీసుల్లో పనిచేసేవారికి ఇంక్రిమెంట్లు, పదోన్నతులు ఉంటాయి. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు.
ఈ రోజు వ్యాపారులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. వృత్తినిపుణులు, ఆఫీసుల్లో పనిచేసేవారికి సహచరులు, తోటి ఉద్యోగుల నుంచి మంచి సహకారం అందుతుంది. తీర్థయాత్రలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రోజు మీరు సురక్షితంగా ఉండేందుకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పనులు మీరు అనుకున్నట్టుగా సాగవు. కాబట్టి కొత్త పథకాలు, కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి.
ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. విదేశీయుల సాంగత్యంలో మీరు ఆహ్లదంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి ప్రదేశాలను సందర్శిస్తారు. సాహిత్యపరమైన కార్యకలాపాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది. భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి.
ఈ రోజు ఒక చిత్రం మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈ రోజు అంత పరిపూర్ణంగా ఉంటుంది. వ్యాపారస్థులు, ఉద్యోగస్థులు, గృహిణులు, విద్యార్ధుల జీవితాలు కొన్నిసార్లు ఎంత సౌకర్యవంతంగా, ఓదార్పుగా ఉంటుందో ఈ రోజు మీరు చూస్తారు. ఈ రోజు మీ విరోధులు ఓటమిపాలవుతారు. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది.
మీరు ఈ రోజు సృజనాత్మకంగా ఆలోచించి కొత్త విషయాలను కనుగొనేందుకు సిద్ధంగా ఉంటారు. మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. మేధోపరమైన చర్చలు జరపవచ్చు. మీరు మీ ఆలోచనలను అక్షరబద్ధం చేస్తారు. దీంతో ఈ రోజు ఎంతో సార్థకత పొందుతారు. ఖర్చులు ఉన్నాయి. కాబట్టి కొంత డబ్బును సిద్ధంగా ఉంచుకోండి. ఆరోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు. మందుల ద్వారా కాస్త ఉపశమనం పొందుతారు.
ఈ రోజు మీలో ఉత్సాహం, తేజస్సు తగ్గవచ్చు. మీ కుటుంబ సభ్యులతో వివాదాలు, గొడవలకు దిగే సూచనలు కనిపిస్తున్నాయి. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉంటే మంచిది. శారీరకంగా, మానసికంగా మీరు బలహీనతకు లోనవుతారు. అలసటగా ఫీలవుతారు.