HOROSCOPE TODAY: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈ రోజు మీ రాశిఫలం
HOROSCOPE TODAY: ఈరోజు (నవంబర్ 11) మీ రాశిఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horoscope today 11 november friday
By
Published : Nov 11, 2022, 6:21 AM IST
HOROSCOPE TODAY: ఈరోజు (నవంబర్ 11) మీ రాశిఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ఉత్సాహంగా ముందుకు సాగితే సమస్యలు దరిచేరవు. ముఖ్య వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. దేహజాఢ్యాన్ని దరిచేరనీయకండి. నవగ్రహ శ్లోకం చదవాలి.
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
శ్రమ ఫలిస్తుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభఫలితాలను పొందగలుగుతారు.
అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.
మంచి కాలం. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రీఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.
మనసుపెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ప్రారంభించిన పనులలో ఆటంకాలు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. మీకు రావాల్సిన అవకాశాలు రాకపోవడం, పక్కవాళ్లకు రావడంతో కాస్త నిరుత్సాహం ఆవరిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.
మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారంలో మీరు అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల ఫలిస్తాయి. హనుమత్ దర్శనం శ్రేయస్సును ఇస్తుంది.
మీ మీ రంగాల్లో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన మంచిది.
ప్రారంభించబోయే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు, వాటిని ప్రారంభించడంలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జపించాలి.
ప్రారంభించబోయే పనుల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. బంధువులతో వైరసూచన. ప్రయాణాల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.