తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today 10th September 2023 : ఆ రాశుల వారికి రోజంతా అదృష్టమే.. అన్నీ శుభవార్తలే! - Horoscope Today in telugu

Horoscope Today 10th September 2023 : సెప్టెంబర్​ 10న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today in telugu
Horoscope Today 10th September 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 5:01 AM IST

Horoscope Today 10th September 2023 :సెప్టెంబర్​ 10న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ప్రణాళిక ప్రకారం అన్ని పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం వేళ ఆనందంగా గడుపుతారు. ప్రేమ ఫలిస్తుంది. చక్కని సంగీతం వింటూ ఆనందంగా మధుర క్షణాలను అనుభవిస్తారు.

వృషభం (Taurus) : మీలో కొత్త ఆలోచనలు ఏర్పడతాయి. మీ దృష్టి అంతా వాటికి సంబంధించిన వ్యవహారాలపైనే ఉంటుంది. కానీ మధ్యాహ్నం మీకు అంత ఆశాజనకంగా ఉండదు. కొన్ని కారణాల వల్ల దిగులు చెందుతారు. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు సన్నిహితులతో కలిసి గడపడం మంచిది.

మిథునం (Gemini) :ఈ రోజు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆవేశం, పోటీ తత్వం మీలో ఏర్పడుతుంది. ఈ రోజు మీకు కొంచెం తికమకగా ఉంటుంది. ఎంతో నిరాశజనకంగా అనిపించినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటపడేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఈ రోజు వింటారు.

కర్కాటకం (Cancer) :ఈ రోజు మీ ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోతాయి. కాబట్టితెలివిగా ఖర్చుచేయాల్సి ఉంటుంది. కంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.

సింహం (Leo) : ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రోజులో మొదటి సగభాగం శుభవార్తలతో నిండి ఉంటుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అన్నీ మంచి వార్తలే వింటారు. అలాగే మీ ఆదాయం, ఇతర ఆర్ధిక వనరులు పెరిగేందుకు అవకాశం ఉంది.

కన్య (Virgo) :ఈ రోజు మీ సృజనాత్మక ప్రజలకు తెలుస్తుంది. ఈ రోజు మీకు సానుకూలంగా ఉంటుంది. పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు వస్తాయి. ఇంటిని చక్కని ఫర్నీచర్, కళాకృతులతో తీర్చిదిద్దుతారు.

తుల (Libra) : ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆందోళనల సుడిగుండంలో చిక్కుకుని, ఎన్నడూ లేనంత దీనస్థితిలోకి చేరుకుంటారు. మీ పిల్లలు మీతో విభేదిస్తారు. పనిచేసే చోట కూడా అంత అనుకూలంగా ఉండదు. పైఅధికారి వల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం (Scorpio) :ఈ రోజు అంతా మీకు బాగా కలిసి వస్తుంది. మీ అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తారు. వ్యాపారులు ఈ రోజు మంచి లాభాలు అందుకుంటారు. కానీ ఖర్చుల కోసం మీరు అవసరమైన దానికంటే ఎక్కువ నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ రోజు ఆహ్లాదకరంగా గడుపుతారు.

ధనుస్సు (Sagittarius) :ఈ రోజు ధనస్సు రాశివారికి కలిసి వస్తుంది. మీ హృదయం కోరుకునే విషయం కోసం చాలా శ్రమిస్తారు. మీ పనిలోని నాణ్యతను అందరూ గుర్తిస్తారు. మీ అభిరుచికి అనుగుణంగా పనిచేస్తారు. మీ లక్ష్య సాధనకు చాలా చేరువ అవుతారు.

మకరం (Capricorn) :ఈ రోజు మకర రాశి వారికి బాగుంటుంది. మంచి మాటలతోనే మీ సమస్యలు అన్నింటినీ పరిష్కరించుకుంటారు. ఇంటి పరిస్థితులు చక్కబడతాయి. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా లాభపడతారు.

కుంభం (Aquarius) :ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇది మీరు మరింత కష్టించి పనిచేసేందుకు కారణమవుతుంది. మీ పనితీరు మీ ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. కానీ ఇతరుల పొగడ్తలకు అతిగా స్పందించకండి.

మీనం (Pisces) : ఈ రోజు ఉత్సాహం, శక్తి నిండిన రోజు. దూరప్రాంతాల నుంచి మీరు శుభవార్త అందుకుంటారు. వృత్తిపరంగా చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న పనులను మీరు పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు వ్యాపారపరంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details