Horoscope Today 10th October 2023 : అక్టోబర్ 10న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మీ పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి ఫలితాలు వస్తాయి. పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోండి.
వృషభం (Taurus) : ఈ రోజు మీరు చేసే పనిలో ఆత్మ విశ్వాసం చూపుతారు. విజయాలు అందుకుంటారు. ఆస్తి చేకూరే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతారు. ప్రభుత్వం నుంచి ఆర్థకంగా లబ్ధి పొందుతారు. మీ పిల్లల పేరు మీద డబ్బు ఆదా చెయ్యండి.
మిథునం (Gemini) : కొత్త ప్రాజెక్ట్లు ప్రారంభిస్తారు. ప్రభుత్వ పనుల్లో లాభాలు పొందొచ్చు. అధికారులు నుంచి ప్రశంసలు అందుకుంటారు. సన్నిహితుల మధ్య అపార్థాలు రావచ్చు. ఇరుగుపొరుగువారితో గొడవలు కలగవచ్చు. ఆర్థిక సంబంధమైన లావాదేవీల పట్ల జాగ్రత్తగా ఉండండి.
కర్కాటకం (Cancer) : ఈ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురుకావచ్చు. కాస్త అసంతృప్తి ఉంటారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అపార్థాలు తలెత్తవచ్చు. విద్యార్థులు తమ ఫలితాలతో నిరాశపరుస్తారు. అనైతికమైన పనులకు దూరంగా ఉండండి.
సింహం (Leo) : ఈ రోజు మీరు లాభాలు గడిస్తారు. నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. మాటలలో, వ్యవహారంలో పొందిక నేర్చుకోండి. కోపాన్ని తగ్గించుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి.