Horoscope Today (10-04-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - గ్రహ బలం
Horoscope Today (10-04-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
horoscope
By
Published : Apr 10, 2022, 5:57 AM IST
Horoscope Today (10-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
కష్టపడి పనిచేస్తే తప్ప పనులు పూర్తికావు. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మంచిది.
తలచిన కార్యక్రమాలు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలు ఉన్నాయి. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది.
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.
అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
దైవబలంతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. మీ పట్టుదల లక్ష్యాన్ని చేరుస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితముంటుంది. ఏదీ మనసుకు తీసుకోవద్దు. ఆర్థికంగా అనుకూలం. వారం మధ్యలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. దుర్గాదేవిని దర్శించండి. సంతృప్తి లభిస్తుంది.
ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తవుతాయి. సంతోషకరమైన కాలం ఉంది . వస్త్ర, ధాన్యాది లాభాలు ఉన్నాయి. విందు, వినోద సుఖాలు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ అభివృద్దికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే ఇంకా బాగుంటుంది.
వ్యాపారబలం పెరుగుతుంది. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. పలు మార్గాల్లో విజయముంటుంది. ప్రణాళిక ప్రకారం పనిచేయండి. త్రికరణశుద్ధితో ముందుకు సాగండి, ఆశయం నెరవేరుతుంది. లక్ష్మీ ఆరాధన మంచిది.
బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారాలలో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.
అనేక మార్గాల్లో శుభాలున్నాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. సద్వినియోగం చేసుకోండి. వ్యాపారరీత్యా అధిక లాభాలుంటాయి. బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఇష్టదేవతను స్మరిస్తే మేలు.
మీ రంగాల్లో విజయం సాధిస్తారు. సంపూర్ణ కార్యసిద్ది ఉంది. సంపూర్ణ మనోబలం కలిగి ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
మీ మీ రంగాల్లో ప్రణాళికాబద్దంగా ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. గతం కంటే మంచి సమయం. బంధు ప్రీతి కలదు. స్థిరాస్తి కి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఇష్టదైవానామస్మరణ ఉత్తమం