తెలంగాణ

telangana

ETV Bharat / bharat

July 16 horoscope : నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి - రాశి ఫలాలు మీన రాశి

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE TODAY
రాశి ఫలాలు

By

Published : Jul 16, 2021, 5:03 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..

మేషం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

వృషభం

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మిథునం

ఉత్సాహంగా ముందుకు సాగితే సమస్యలు దరిచేరవు. ముఖ్య వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. దేహజాఢ్యం ఉంది. చంద్ర శ్లోకం చదవాలి.

కర్కాటకం

అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు దక్కుతాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

సింహం

శ్రమ అధికం అవుతుంది. మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కన్య

కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మానసిక ఆనందాన్ని కలిగించే ఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.

తుల

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

వృశ్చికం

శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. సాయిబాబా వారి సచ్ఛరిత్ర పారాయణ శుభాలను కలిగిస్తుంది.

ధనుస్సు

చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

మకరం

చేపట్టే పనుల్లో అనుకూలత ఉంటుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

కుంభం

చేపట్టే పనిలో ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. మానసిక అశాంతి పెరుగుతుంది. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

మీనం

అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందూ,వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details