తెలంగాణ

telangana

ETV Bharat / bharat

July 15 horoscope : నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి - రాశి ఫలాలు మీన రాశి

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE
రాశి ఫలాలు

By

Published : Jul 15, 2021, 4:33 AM IST

Updated : Jul 15, 2021, 6:17 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..

మేషం

శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. శివ సందర్శనం శుభప్రదం.

వృషభం

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. శనిధ్యానం శుభప్రదం.

మిథునం

పట్టుదలను వదలకండి. శ్రమ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిర నిర్ణయాలతో మంచి చేకూరుతుంది. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రశాంతత కోసం దైవధ్యానం చేయడం ఉత్తమం.

కర్కాటకం

సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. శివారాధన శుభాన్ని కలిగిస్తుంది.

సింహం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

కన్య

ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఇష్ట దైవ ధ్యానం చేయాలి.

తుల

ముఖ్య వ్యవహారంలో పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కీలక విషయాల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. ఆదిత్య హృదయం చదవటం శుభప్రదం.

వృశ్చికం

ధర్మసిద్ధి కలదు. వృత్తి, ఉద్యోగ వ్యాపార స్థలాలలో సమర్థత పెరుగుతుంది. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. అభీష్టాలు నెరవేరుతాయి. ఈశ్వరధ్యానం శుభప్రదం.

ధనుస్సు

మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవిందా నామాలు చదివితే బాగుంటుంది.

మకరం

మిశ్రమ కాలం నడుస్తోంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. శివారాధన శుభప్రదం.

కుంభం

మీ మీ రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

మీనం

మనోధైర్యంతో చేసే పనులు నెరవేరుతాయి. కొన్ని సంఘటనలు ఉత్తేజాన్నిఇస్తాయి. కొన్ని సందర్భాల్లో సమయస్ఫూర్తి అవసరం. లక్ష్మీ ఆరాధన శుభకరం.

Last Updated : Jul 15, 2021, 6:17 AM IST

ABOUT THE AUTHOR

...view details