తెలంగాణ

telangana

ETV Bharat / bharat

July 14 horoscope : నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి - రాశి ఫలాలు టుడే

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE
రాశి ఫలాలు

By

Published : Jul 14, 2021, 5:00 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..

మేషం

ప్రారంభించిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. దైవబలం రక్షిస్తుంది. బంధు,మిత్రుల సహకారం మేలు చేస్తుంది. నవగ్రహ స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రారంభించిన పనులలో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది. చక్కటి ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరుకుంటారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

మిథునం

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. దుర్గాధ్యానం శుభప్రదం.

కర్కాటకం

ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. చంచల స్వభావంతో ఇబ్బంది పడతారు. దైవారాధన మానవద్దు.

సింహం

గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో సమర్ధంగా ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం శుభప్రదం.

కన్య

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

తుల

మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మీధ్యానం వల్ల మంచి జరుగుతుంది.

వృశ్చికం

కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య ఈ వారం పరిష్కారం అవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. గణపతిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు

స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. సకాలంలో ఆదుకునేవారున్నారు. శివారాధన చేయడం మంచిది.

మకరం

ముఖ్యమైన విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. విష్ణు సందర్శనం శుభప్రదం.

కుంభం

మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంది. మనోబలం సదా కాపాడుతుంది. తోటివారి సహకారం ఉంటుంది. విష్ణు నామస్మరణ ఉత్తమం.

మీనం

విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్యహృదయం చదవడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details