తెలంగాణ

telangana

ETV Bharat / bharat

July 13 horoscope : నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి - ఈరోజు రాశి ఫలాలు కర్కాటకం

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE OF THE DAY JULY 13
రాశి ఫలాలు

By

Published : Jul 13, 2021, 5:13 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..

మేషం

సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభిస్తే మంచిది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. పంచమంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. చంద్రధ్యానం శుభప్రదం.

వృషభం

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. అవసరానికి తగ్గట్టు ముందుకు సాగడం మేలు. చతుర్థ చంద్ర సంచారం మిశ్రమ ఫలితం ఇస్తోంది. శివారాధన శుభాన్ని ఇస్తుంది.

మిథునం

శుభ భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. శివారాధన శుభప్రదం.

కర్కాటకం

పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

సింహం

మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. మహాలక్ష్మి దర్శనం శుభప్రద

కన్య

మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. ఉమామహేశ్వరస్తోత్రం పఠిస్తే మంచిది.

తుల

మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతారాధన శుభాన్ని కలిగిస్తుంది.

వృశ్చికం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం ఉత్తమం.

ధనుస్సు

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబం సహకారం ఉంటుంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.

మకరం

మీమీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మి ధ్యానం మంచినిస్తుంది.

కుంభం

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్య పనులను మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీదేవి సందర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

మీనం

మీ మీ రంగాల్లో మేలైన ఫలితాలు ఉన్నాయి. బంధుజనుల సహకారం ఉంది. అభివృద్ధికి దోహదపడే నిర్ణయాలు ఫలిస్తాయి. ఈశ్వర ధ్యానం శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details