తెలంగాణ

telangana

ETV Bharat / bharat

July 11 horoscope : నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు

By

Published : Jul 11, 2021, 4:13 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..

మేషం

పనిచేస్తున్న రంగంలో కీర్తి పెరుగుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు సాయం అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.

వృషభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

మిథునం

సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీ సందర్శనం ఉత్తమం.

కర్కాటకం

ధైర్యబుద్ధితో చేసే పనులు గొప్ప లాభాన్ని ఇస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

సింహం

చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వల్ల ఇంటగెలుస్తారు. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. శివారాధన శుభప్రదం.

కన్య

శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

తుల

శ్రమ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని వార్తలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ప్రశాంతత పెరుగుతుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.

వృశ్చికం

ఒక వార్త ఆనందాన్నికలిగిస్తుంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధు,మిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన ద్వారా శుభఫలితాలు పొందుతారు.

ధనుస్సు

ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మనోధైర్యం తగ్గకుండా ముందుకు సాగాలి. సర్వత్రా కలహ సూచన. అష్టమంలో చంద్ర స్థితి అనుకూలించడంలేదు. స్వల్ప అనారోగ్యం, మనోవిచారం సూచితం. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

మకరం

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. ఒక వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.

కుంభం

మనస్సౌఖ్యం కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

మీనం

అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలు కలవు. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details