తెలంగాణ

telangana

ETV Bharat / bharat

June 29 Horoscope: ఈ రోజు రాశి ఫలం

ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope
రాశి ఫలాలు

By

Published : Jun 29, 2021, 4:49 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం

మేషం

అనుకున్న పనిని వెంటనే పూర్తి చేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. ప్రశాంతమైన జీవనం ఉంది. లక్ష్మీ ఆరాధన మంచిది.

వృషభం

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. శివారాధన శుభప్రదం.

మిథునం

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాల వల్ల మంచి జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సమయానికి నిద్రాహారాలు అవసరం.శివారాధన శుభప్రదం.

కర్కాటకం

సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. అధికారులు, పెద్దలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిబలం విశేషంగా పని చేస్తుంది. అందరినీ సమభావంతో చూడటం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

సింహం

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మంచిది.

కన్య

విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మేలు చేస్తుంది.

తుల

మిశ్రమకాలం. శారీరక శ్రమ పెరగవచ్చు. అనవసర ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించండి..మంచి చేకూరుతుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి.

వృశ్చికం

మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. గిట్టనివారితో జాగ్రత్త. వాగ్వాదాలు చేయకండి. శ్రీఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

ధనుస్సు

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఫలిస్తుంది. ముఖ్య విషయాల్లో పరిరక్షణ అవసరం.మానసిక ప్రశాంతత కోసం వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

మకరం

అనుకున్న పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. శారీరక శ్రమ పెరిగినా అందుకు తగిన ఫలితాలు లభించడం వల్ల సంతోషంగా ఉంటారు. దుర్గాస్తుతి పఠించాలి.

కుంభం

మంచి కాలం. మీ మీ రంగాల్లో లాభదాయకమైన ఫలితాలు సొంతం అవుతాయి. మనఃసౌఖ్యం ఉంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శ్రీ శివ పార్వతుల ఆరాధన శక్తిని ఇస్తుంది.

మీనం

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.

ABOUT THE AUTHOR

...view details