నేటి రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..
మేషం
ఇష్టకార్యసిద్ధి ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్య నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. దత్తాత్రేయ ఆరాధన చేస్తే మంచిది.
వృషభం..
చేపట్టబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో పొరపొచ్చాలు రాకుండా చూసుకోవాలి. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది.అపార్ధాలకు తావులేకుండా వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది.
మిథునం..
మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శించే వారి మాటలను పట్టించుకోవద్దు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఇష్ట దైవారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. లక్ష్మీకటాక్ష సిద్ధి కలుగుతుంది. అదృష్టవంతులవుతారు. శ్రేష్ఠమైన జీవితం లభిస్తుంది. వ్యాపారంలో లాభం వస్తుంది.
కర్కాటకం..
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమ ఫలిస్తుంది. సమయస్ఫూర్తి తో ఆటంకాలు తొలుగుతాయి. ముఖ్య విషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆదిత్య హృదయం చదువుకోవాలి.
సింహం..
విశేషమైన శుభఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో జయకేతనం ఎగురవేస్తారు. బుద్ధిబలం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అష్టలక్ష్మీ దేవి దర్శనం శుభప్రదం.
కన్య..
ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. మనసు చెప్పింది చేయండి.. శుభం చేకూరుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. దైవారాధన మానవద్దు.