నేటి రాశిఫలాల (Today Horoscope) గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..
మేషం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ పనితీరు, ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.మనశ్శాంతి లభిస్తుంది.శని శ్లోకం చదవండి.
వృషభం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం మంచిది. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది. దుర్గాస్తోత్రం పఠించాలి.
మిథునం
ప్రారంభించిన పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. బుద్దిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలను పొందుతారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. విష్ణు నామ స్మరణ ఉత్తమ ఫలాలను ఇస్తుంది.
కర్కాటకం
కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.
సింహం
ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది. చేసే పనిలో తడబాటు రానీయకండి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. కలహసూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు. దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది.
కన్య
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు ఊహించినదాని కన్నా అధిక ధనలాభం పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలో ముందడుగు పడుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.