తెలంగాణ

telangana

ETV Bharat / bharat

August 30 Horoscope: ఈ రోజు రాశి ఫలం - డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

August 30 Horoscope
ఈ రోజు రాశి ఫలం

By

Published : Aug 30, 2021, 3:56 AM IST

నేటి రాశిఫలాల (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..

మేషం

చేపట్టే పనులలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఎవ్వరితోనూ మాట పట్టింపులకు పోరాదు. ఉత్సాహంతో ముందుకు సాగండి సత్ఫలితాలను సొంతంచేసుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.

వృషభం

శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం అందుతుంది. బంధుమిత్రులతో అతి చనువు వద్దు. ఒత్తిడి లేకుండా పనిచేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివ నామాన్ని జపిస్తే మంచిది.

మిథునం

వృత్తి,ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం

బంధువుల సహకారంతో ఒక ముఖ్యమైన పనిని పూర్తిచేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

సింహం

మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్యాష్టకాన్ని చదివితే మంచిది.

కన్య

లక్ష్యసాధనలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. మిమ్మల్ని విరోధించే వారితో జాగ్రత్త. అనవసర విషయాలతో కాలహరణం అవుతుంది. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

తుల

మీమీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి. అష్టమ చంద్ర దోషం ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ బద్ధకాన్ని దరిచేరనీయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. చంద్ర ధ్యానం జపించడం ఉత్తమం.

వృశ్చికం

అనుకూలఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలుంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీ విష్ణునామాన్ని పఠించడం మంచిది.

ధనుస్సు

అనుకున్నది సాధించడానికి కాస్త ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. బంధుమిత్రుల వల్ల ధన వ్యయం జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీ రామ నామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

మకరం

చేపట్టిన కార్యాలు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగానికి ఆంజనేయ ఆరాధన చేయాలి.

కుంభం

మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలాన్నిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతోగడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. ఇష్టదేవతా ఆరాధనమేలు చేస్తుంది.

మీనం

సుఖసౌఖ్యాలున్నాయి. తలపెట్టిన కార్యాలను మనోధైర్యంతో పూర్తిచేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details