తెలంగాణ

telangana

ETV Bharat / bharat

August 25 Horoscope: ఈ రోజు రాశి ఫలం

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు

By

Published : Aug 25, 2021, 4:09 AM IST

నేటి రాశిఫలాల (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..
మేషం

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలున్నాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

వృషభం

కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దైవారాధన మానవద్దు.

మిథునం

ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది

కర్కాటకం

మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో చంచల బుద్ధితో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

సింహం

చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా.. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వలన ఇంటగెలుస్తారు. శివారాధన శుభప్రదం.

కన్య

బంగారు భవిష్యత్తుకై వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.

తుల

అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తిచేస్తారు. విందు, వినోదాలతో కాలం గడుస్తుంది. లక్ష్మీ దేవిని సందర్శిస్తే మంచిది.

వృశ్చికం

శ్రమ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టుదలను వదలొద్దు. అస్థిర నిర్ణయాలతో ఇబ్బందులు పడతారు. కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రశాంతత కోసం దైవధ్యానం చేయడం మంచిది.

ధనస్సు

అనుకూలమైన కాలం కాదు. మీమీ రంగాల్లో తోటివారిని కలుపుకుపోతే మంచిది. పనుల్లో ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం దైవచింతన అవసరం. సూర్య ఆరాధన చేస్తే మంచిది.

మకరం

లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం పొందుతారు. శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం.

కుంభం

ముఖ్య విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కనకధారాస్తవం పఠించాలి.

మీనం

మంచి మనసుతో పనులను ప్రారంభిస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. మిత్రబలం పెరుగుతుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details