తెలంగాణ

telangana

ETV Bharat / bharat

August 20 Horoscope: నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశి ఫలాలు

By

Published : Aug 20, 2021, 4:43 AM IST

నేటి రాశిఫలాల(Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..

మేషం

ప్రారంభించిన పనిలో శ్రమ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరనిర్ణయాలతో మంచి చేకూరుతుంది. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రశాంతత కోసం దైవధ్యానం చేయడం ఉత్తమం.

వృషభం

మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు చదివితే బాగుంటుంది.

మిథునం

గ్రహబలం బాగుంది. శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం శుభప్రదం.

కర్కాటకం

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభాన్ని చేకూరుస్తుంది.

సింహం

అనుకూలమైన కాలం. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శనిధ్యానం చదవాలి.

కన్య

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

తుల

ముఖ్య వ్యవహారంలో పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కీలక విషయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదిత్యహృదయం చదవటం శుభప్రదం.

వృశ్చికం

ధర్మసిద్ధి కలదు. వృత్తి, ఉద్యోగ వ్యాపార స్థలాలలో సమర్ధత పెరుగుతుంది. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. అభీష్టాలు నెరవేరుతాయి. ఈశ్వర ధ్యానం శుభప్రదం.

ధనుస్సు

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. శనిధ్యానం శుభప్రదం.

మకరం

మిశ్రమ కాలం నడుస్తోంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. శివారాధన శుభప్రదం.

కుంభం

మీ మీ రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

మీనం

మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. కొన్ని సంఘటనలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో సమయస్ఫూర్తి అవసరం. లక్ష్మీ ఆరాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details