తెలంగాణ

telangana

ETV Bharat / bharat

August 17 Horoscope: నేటి మీ రాశి ఫలాలు తెలుసుకోండి - నేటి రాశులు ఫలితాలు

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE
రాశి ఫలాలు

By

Published : Aug 17, 2021, 4:23 AM IST

Updated : Aug 17, 2021, 6:52 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం

మేష రాశి
చేపట్టే పనిలో శ్రమ అధికం అవుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో ఆగిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. మనోవిచారాన్ని కలిగించే వాటికి జాగ్రత్తగా ఉండాలి. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.

వృషభ రాశి

ఇష్టకార్య సిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శివ ఆరాధన చేస్తే మంచిది.

మిథున రాశి

ఉద్యోగంలో ఉన్నతస్థితికి చేరుతారు. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. శివారాధన శక్తిని ఇస్తుంది.

కర్కాటక రాశి

లక్ష్యసాధనలో అసాధారణమైన పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. దుష్టులకు దూరంగా ఉండండి. ఈశ్వర దర్శనం శుభప్రదం.

సింహ రాశి

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి..మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.

కన్య రాశి

పట్టుదలతో చేపట్టిన పనులలో విజయాన్నిసాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
తులా రాశి

మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహకారం ఉంటుంది. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

వృశ్చిక రాశి

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మీ భుజాన కొత్త బాధ్యతలు పడతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే బాగుంటుంది.

ధనుస్సు రాశి

కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో కాస్త సంయమనంతో ఆచితూచి వ్యవహరించాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.

మకర రాశి

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. ఇష్టదేవతా స్తోత్రం పఠించడం మంచిది.

కుంభ రాశి

అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. కీలక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. దుర్గాస్తోత్రం పఠించాలి.

మీన రాశి

చేపట్టే పనుల్లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఉత్సాహంగా పనిచేయాలి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. సూర్యాష్టకం చదివితే శుభప్రదం.

Last Updated : Aug 17, 2021, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details