తెలంగాణ

telangana

ETV Bharat / bharat

August 16 Horoscope: ఈ రోజు రాశి ఫలం

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

రాశి ఫలాలు
Horoscope

By

Published : Aug 16, 2021, 5:05 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం

మేష రాశి

మిశ్రమకాలం. మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. నవగ్రహ శ్లోకాలను పఠిస్తే అన్నివిధాలా మంచిది.

వృషభ రాశి

మీరు పనిచేసే రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. మానసికంగా ద్రుడంగా ఉంటారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారమవుతుంది. లలితా దేవి నామస్మరణ శుభప్రదం.

మిథున రాశి

వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదుగుతారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

కర్కాటక రాశి

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో స్థిరమైన ఫలితాలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులను పూర్తిచేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కీలక వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు మంచినిస్తాయి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

సింహ రాశి

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. నూతన వస్తువులు కొంటారు. వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం.

కన్య రాశి

అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పెద్దలు ప్రశంసలు లభిస్తాయి. మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మరువలేని శుభఫలాలను ప్రసాదిస్తాయి. కులదైవ సందర్శనం శుభప్రదం.

తులా రాశి

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. మనోబలం పెరగడానికి హనుమాన్ చాలీసా చదవాలి .

వృశ్చిక రాశి

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులను కొంటారు. లక్ష్మీ అష్టోత్తరం పఠిస్తే ఇంకా మంచిది.

ధనుస్సు రాశి

చేపట్టే పనిలో బద్ధకాన్ని వదలాలి. ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్నిస్తుంది. ఆదిత్య హృదయం పఠిస్తే బాగుంటుంది.

మకర రాశి

శుభ కాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. ఆపదలో సహాయం చేసేవారున్నారు. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. శివారాధన చేయడం మంచిది.

కుంభ రాశి

మనోబలంతో చేసే పనులు సిద్ధిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ముఖ్య వ్యవహరాలలో ఆర్థిక సాయం అందుతుంది. ముఖ్య విషయాల్లో అస్థిర బుద్ధిని రానీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం

మీన రాశి

కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

ABOUT THE AUTHOR

...view details