తెలంగాణ

telangana

ETV Bharat / bharat

July 1 Horoscope: ఈ రోజు రాశి ఫలం - ఈ రోజు రాశిఫలాలు

ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశి ఫలాలు

By

Published : Jul 1, 2021, 4:46 AM IST

నేటి రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం

మేషం

ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోకూడదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.

వృషభం

తలపెట్టిన పనుల్లో ఆటంకాలు కలగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివ స్తోత్రం పఠించడం మంచిది.

మిథునం

పట్టుదలతో ఉండాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కలహాలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. పెద్దల సహకారం లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

కర్కాటకం

మనోబలంతో చేసే పనులు మంచి ఫలితాన్నిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.

సింహం

మంచి కాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఈశ్వర సందర్శనం మంచిది.

కన్య

గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారంలో లాభాన్ని ఆర్జిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శ్రేయోదాయకం.

తుల

అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.

వృశ్చికం

మీ మీ రంగాల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. గణపతి సహస్రనామ పారాయణం మంచినిస్తుంది.

ధనుస్సు

మీ మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వరాభిషేకం శుభాన్నిస్తుంది.

మకరం

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. చంద్ర ధ్యానం శుభప్రదం.

కుంభం

ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామాలు పారాయణ మంచిది.

మీనం

పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details