తెలంగాణ

telangana

ETV Bharat / bharat

September 6 Horoscope: ఈ రోజు రాశి ఫలం - vogue horoscope today

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

September 6 Horoscope
ఈ రోజు రాశి ఫలం

By

Published : Sep 6, 2021, 4:18 AM IST

Updated : Sep 6, 2021, 5:26 AM IST

Intro:Body:

నేటి రాశిఫలాల (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..

మేషం

దైవబలం కాపాడుతోంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

వృషభం

గ్రహబలం అనుకూలంగా లేదు. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. కొందరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.

మిథునం

శుభకాలం. మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. అర్థలాభం సూచితం. దుర్గాస్తుతి చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.

కర్కాటకం

ఉత్సాహంగా పనిచేయాలి. శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

సింహం

అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహారంలో మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పారాయణ మంచిది.

కన్య

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

తుల

అనుకూల ఫలితాలు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. కొన్ని పరిస్థితులు మీకు మానసిక ఇబ్బంది కలిగిస్తాయి.లింగాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.

వృశ్చికం

అనుకున్న పని నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్య ధ్యానశ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

ధనుస్సు

పట్టుదలతో పనిచేయండి. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. గణపతి ధ్యానం శుభప్రదం.

మకరం

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలను రాబట్టడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సమయపాలన పాటించండి. బలమైన ఆహారం, విశ్రాంతి అవసరం అవుతాయి. ప్రయాణాలలో ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామనామాన్ని జపించండి.

కుంభం

పెద్దల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహాన్ని భంగం చేయాలని చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.

మీనం

మంచి కాలం. ఆర్థికంగా విజయం సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. రాజదర్శన సల్లాపాలు, భోజన సౌఖ్యం లభిస్తాయి. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది.

Last Updated : Sep 6, 2021, 5:26 AM IST

ABOUT THE AUTHOR

...view details