తెలంగాణ

telangana

ETV Bharat / bharat

September 5 Horoscope: ఈ రోజు రాశి ఫలం - ఈనాడు రాశి ఫలాలు

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE TODAY
ఈ రోజు రాశి ఫలం

By

Published : Sep 5, 2021, 4:18 AM IST

Updated : Sep 5, 2021, 5:02 AM IST

నేటి రాశిఫలాల (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..

మేషం

ప్రారంభించిన కార్యక్రమాలను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

వృషభం

చేపట్టే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. దైవబలం పెరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.

మిథునం

సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉంటారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అనూహ్యమైన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు.

కర్కాటకం

మీ మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. తోటి వారి సూచనలను పాటించడం ఉత్తమం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

సింహం

పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఆశించిన ఫలితం దక్కుతుంది. ఆదాయం కన్నా వ్యయం మించకుండా చూసుకోవాలి. ఈశ్వర దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

కన్య

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దైవారాధన మానవద్దు.

వృశ్చికం

నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. నూతన వస్తు,వస్త్ర ప్రాప్తి కలదు. బలమైన ఆహారం, సమయానికి తగిన విశ్రాంతి అవసరం అవుతాయి. చిరునవ్వుతో అనేక సమస్యలు దూరం అవుతాయని గుర్తించాలి. శ్రీరామనామాన్ని జపించాలి.

ధనుస్సు

అనుకూల సమయం కాదు. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. బంధు,మిత్రులతో మాట పట్టింపులకు పోవద్దు. చెడు సావాసాలు చేయరాదు. కీలక విషయాల్లో అశ్రద్ధగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.

మకరం

మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్త సంబంధీకులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో అజాగ్రత్త తగదు. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కుంభం

మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. ధర్మసిద్ధి ఉంది. ముఖ్యమైన విషయాల్లో సొంతనిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. విష్ణు సందర్శనం శుభప్రదం.

మీనం

శుభకాలం. ఉత్సాహంగా కాలం గడుపుతారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. సూర్య ఆరాధన చేస్తే మంచిది.

Last Updated : Sep 5, 2021, 5:02 AM IST

ABOUT THE AUTHOR

...view details