Horoscope Today (12-04-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - పన్నెండు రాశుల వారి సమయం
Horoscope Today (12-04-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
horoscope
By
Published : Apr 12, 2022, 5:43 AM IST
Horoscope Today (12-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
మిశ్రమ ఫలాలున్నాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులతో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.
విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సుఖసంతోషాలతో గడుపుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. దైవబలం అనుకూలిస్తోంది. శివ ఆరాధన మేలు చేస్తుంది.
బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శరీర సౌఖ్యం కలదు. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.
చేపట్టిన పనులు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇదే సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగానికి ఆంజనేయ ఆరాధన చేస్తే మంచిది.
వృత్తి పరంగా అనుకూలత ఉంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది.
అనుకూల ఫలితాలున్నాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.
భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలుపెట్టిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సాయి బాబా సచ్చరిత్ర పఠిస్తే బాగుంటుంది.
మిశ్రమ వాతావరణం ఉంటుంది. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. సూర్య ఆరాధన చేస్తే మంచిది.
మనస్తాపం చెందకుండా మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.
ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. గణపతి అష్టోత్తరం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి
విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. విష్ణు సహస్రనామం చదివితే మంచిది.
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. అవసరానికి తగిన ధనం అందుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. శనిధ్యాన శ్లోకం చదువుకుంటే మంచిది.