తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (11-04-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today (11-04-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
Horoscope Today

By

Published : Apr 11, 2022, 5:34 AM IST

Horoscope Today (11-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవరినీ విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమ్తతంగా ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ మంచిది.

దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ,సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శని ధ్యానం శుభదాయకం.

అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము చదవడం మంచిది.

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. సాయినామాన్ని జపించాలి.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ దర్శనం మంచిది.

శుభ కాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరబుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన మంచిది.

చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. కష్టాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. శ్రీ రామనామాన్ని జపించడం శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details