కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని చుట్టేయడం వల్ల.. గతేడాది నుంచి అన్ని దేశాలూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. గతంలోనూ ఇలాంటి వైరస్లు ప్రబలిన కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అయితే.. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా ప్రజలు మాత్రం ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండేందుకు నాటి నుంచీ ఓ శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తారట. అదే.. వారు దశాబ్దాల నుంచి ఎంతో గొప్పగా చేసుకునే 'హోరాబేదు' ఉత్సవం. కన్నడలో హోరాబేదు అంటే 'బయటపడటం/రక్షించుకోవడం' అని అర్థం.
హోరాబేదు-శాస్త్రీయ కారణం..
శివమొగ్గ తాలుకాలోని మందగత్త గ్రామ వాసులు.. ప్రతి మూడేళ్లకు ఓసారి తమ పెంపుడు, వీధి జంతువులతో సహా ఆ రోజు వాళ్ల ఇళ్లను ఖాళీ చేస్తారు. ఆ రోజంతా ఊళ్లోకి ఎవరూ రాకుండా గ్రామ సరిహద్దుల్లో కంచెను వేస్తారట. తమ పశువులతో పాటు ఊరు వదిలిన ఆ ప్రజలు.. పొలాలకు వెళ్లి రోజంతా అక్కడే ఉంటారు.