Honour Killing in Bihar : బిహార్ భాగల్పుర్ పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో కుమార్తె కుటుంబాన్ని దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. అతడికి కుమారుడు సైతం సహకరించాడు. నడి రోడ్డుపై దారుణంగా కొట్టి అనంతరం తుపాకీతో కాల్చి చంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది
గోపాల్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన నిందితుడు కుమార్తె మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరికి ఓ పాప కూడా జన్మించింది. అయితే, ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వారు అదే గ్రామంలో నివసించడం వల్ల కుమార్తెను బెదిరించాడు తండ్రి. ఇదే గ్రామంలో ఉండొద్దని, మరో ప్రాంతానికి వెళ్లి నివసించాలని సూచించాడు. కానీ ఆ మాటలు పట్టించుకోకపోవడం వల్ల ఆగ్రహించిన తండ్రీకొడుకులు, వారిపై దాడిగి దిగారు. నడిరోడ్డుపై కుమార్తె, అల్లుడు, రెండేళ్ల మనవరాలిని ఐరన్ రాడ్‌తో దారుణంగా కొట్టాడు తండ్రి. ఈ క్రమంలోనే నిందితుడి కుమారుడు ముగ్గురిని తుపాకీతో కాల్చడం వల్ల అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే
Brother Killed Sister In Maharashtra : తమ సోదరి వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని ఆమెను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు ఇద్దరు సోదరులు. భయంతో దాక్కున్నా వెతికి మరీ హతమార్చారు. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులను రిమాండ్‌కు తరలించారు.