తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూతుర్ని చంపి.. పోలీసులకు లొంగిపోయిన తండ్రి - Honor killing in Rajasthan news

కుమార్తెను హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు ఓ తండ్రి. రాజస్థాన్​లో జరిగిందీ ఘటన.

Honor killing in dausa of rajasthan, father killed his daughter
కూతుర్ని చంపి.. పోలీసులకు లొంగిపోయిన తండ్రి

By

Published : Mar 4, 2021, 2:42 PM IST

త్తర్​ప్రదేశ్​లో పరువు కోసం కన్న కూతురి తల నరికి చంపిన ఘటన మరువక ముందే.. రాజస్థాన్​ దౌసాలో అచ్చం ఇటువంటి ఘటనే జరిగింది. పెళ్లి చేసిన తర్వాత.. గతంలో ప్రేమించిన ప్రియుడితో పారిపోయిందని కన్న కూతుర్నే కడతేర్చాడు ఓ తండ్రి. పోలీసు స్టేషన్​లో లొంగిపోయి.. తన కుమార్తెను చంపినట్లు పోలీసులకు చెప్పాడు.

ఇదీ జరిగింది

దౌసా జిల్లాకు చెందిన ఓ యువతి.. ఎస్సీ యువకుడ్ని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెకు బలవంతంగా ఫిబ్రవరి 16న పెళ్లి చేశారు. అయితే కొన్ని రోజులకే ప్రియుడితో వెళ్లిపోయింది. మళ్లీ కొన్ని రోజులకు ఇంటికి వచ్చింది. విషయం తెలిసి ఆగ్రహంతో ఉన్న తండ్రి.. ఆమె తల నరికి చంపేశాడు. అనంతరం పోలీసుల స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.

ఇదీ చూడండి:తాజ్​మహల్​కు బాంబు బెదిరింపు​ వారి పనే!

ABOUT THE AUTHOR

...view details