Honor killing: ఓ యువతి ప్రేమను జీర్ణించుకోలేకపోయిన ఆమె కుటుంబ సభ్యులు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. యువతితో పాటు ఆమె ప్రేమికుడిని ఇంట్లోంచి లాక్కొచ్చి ఇరువురిపై తూటాల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా యువకుడి తలపై ఇటుకరాయితో దాడి చేసి పారిపోయారు. ఈ పరువు హత్య ఉత్తర్ప్రదేశ్ షాజహాన్పుర్ జిల్లాలో మంగళవారం జరిగింది.
ఇదీ జరిగింది..
జిల్లాలోని జలాలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కకరాహ్ గ్రామానికి చెందిన సోనూ అనే యువకుడు తన పొరుగింటిలో ఉండే యువతి ప్రీతిని ప్రేమించాడు. ఇరువురి ప్రేమ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మాట వినకపోవటం వల్ల ఇద్దరినీ చంపేయాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం సాయంత్రం సోనూ.. ప్రీతి ఇంటికి వచ్చిన క్రమంలో ఆమె సోదరులు రాజీవ్, సుశీల్, ములాయం, నర్సింగ్.. ఇరువురిని ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చారు.