తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వలపు వల'లో ఆర్మీ జవాన్​.. పాక్​కు రహస్య సమాచారం!

Army Jawan honey trapped: వలపు వలలో చిక్కుకుని పాకిస్థాన్​కు సైనిక రహస్యాలు చేరవేస్తున్న జవాన్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఫేస్​బుక్​, వాట్సాప్​ల ద్వారా పాకిస్థాన్​ ఐఎస్​ఐ మహిళా ఏజెంట్​తో మాట్లాడుతున్నట్లు గుర్తించారు.

HONEY TRAPPED
'వలపు వల'లో ఆర్మీ జవాన్

By

Published : May 21, 2022, 6:07 PM IST

Updated : May 21, 2022, 6:29 PM IST

Army Jawan honey trapped: భారత సైన్యానికి చెందిన అత్యంత రహస్య, వ్యూహాత్మక సమాచారాన్ని పాకిస్థాన్​ ఐఎస్​ఐ మహిళా ఏజెంట్​కు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో ఓ సైనికుడిని అరెస్ట్​ చేశారు రాజస్థాన్​ పోలీసులు. ఆ జవాను.. పాక్​ మహిళ వలపు వలలో చిక్కుకున్నట్లు నిఘా విభాగం పోలీసులు గుర్తించారు. నిందితుడు జోధ్​పుర్​లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్​.. ప్రదీప్​ కుమార్​ అని తెలిపారు.

పాకిస్థాన్​ ఇంటెలిజెన్స్​ ఏజెన్సీకి చెందిన మహిళా ఏజెంట్​తో ప్రదీప్​..​ కాంటాక్ట్​లో ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొద్దిరోజుల పాటు నిఘా వేసిన తర్వాత సైనికుడిని అరెస్ట్​ చేశామన్నారు. పాక్ మహిళతో ఫేస్​బుక్​, వాట్సాప్​ ద్వారా టచ్​లో ఉన్నాడని, భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆమెతో షేర్​ చేసుకున్నట్లు గుర్తించామన్నారు. అఫీషియల్​ సీక్రెట్​ యాక్ట్​,1923 ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసి.. తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

పాకిస్థాన్​ మహిళా ఏజెంట్​

" మే 18న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత అరెస్ట్​ చేశారు. ఉత్తరాఖండ్​కు చెందిన ప్రదీప్​ కుమార్​ మూడేళ్ల క్రితమే సైన్యంలో చేరాడు. ఆరు నెలల క్రితం ఆ మహిళ నుంచి జవాన్​కు ఫోన్​ వచ్చింది. తాను బెంగళూరులోని ఆర్మీ నర్సింగ్​ సర్వీస్​ సిబ్బందిగా పరిచయం చేసుకుంది. పెళ్లి చేసుకుందామని, అంతకుముందు దిల్లీలో కలుద్దామని ప్రదీప్​ను నమ్మించింది. ఆమె వలలో చిక్కుకున్నట్లు నిర్ధరించుకున్న తర్వాత రహస్య సమాచారానికి సంబంధించిన పత్రాలను సామాజిక మాధ్యమాల వేదికగా తీసుకుంది."

Last Updated : May 21, 2022, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details