వలపు వల(Honey trap) విసిరి తమ బుట్టలో వేసుకుంటారు. అనంతరం వారిని లాడ్జికి రప్పిస్తారు. తర్వాత వారితోనే సెక్స్ రాకెట్ నిర్వహిస్తారు. మహారాష్ట్ర ఠాణెలో ఈ తరహా దందాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ముగ్గురు మహిళలు సహా ఏడుగురిని అరెస్టు చేశారు.
యాప్ల సాయంతో..
నిందితులు వివిధ యాప్ల సాయంతో వినియోగదారులను ఆకర్షిస్తారు(Honey trap). ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేస్తారు. ఈ మేరకు ఠాణె వగ్లే ఎస్టేట్ డివిజిన్ ఏసీపీ జయంత్ బజ్బేల్ తెలిపారు.