తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బడా బ్రాండ్ల తేనె కల్తీమయం'

దిగ్గజ సంస్థలు విక్రయించే తేనె కూడా కల్తీమయమేనని ఓ పరిశోధనలో తేలింది. తేనెలో చక్కెర పాకం కలిపి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.

Honey sold by major brands in India adulterated with sugar syrup: CSE
బడా బ్రాండుల గుట్టు రట్టు- కల్తీ తేనే వ్యాపారం

By

Published : Dec 2, 2020, 6:37 PM IST

దేశంలో పెద్ద బ్రాండుల పేరుతో అమ్ముతున్న తేనె.. కల్తీమయమేనని పర్యావరణ నిఘా సంస్థ సెంటర్​ ఫర్​ సైన్స్​ అండ్​ ఎన్విరాన్​మెంట్​ (సీఎస్​ఈ) తేల్చింది. పెద్ద వ్యాపార సంస్థలూ తేనెను చక్కెర పాకంతో కల్తీ చేస్తున్నాయని తెలిపింది. 13 పెద్ద, చిన్న బ్రాండ్​లు విక్రయిస్తున్న తేనెను పరీక్షించగా... వీటిలో 77శాతం షుగర్​ సిరప్​తో కల్తీ చేస్తున్నట్లు నిర్ధరణ అయిందని వెల్లడించింది. మొత్తం 22 శాంపిల్స్​కు న్యూక్లియర్​ మ్యాగ్నెటిక్ రెస్పాన్స్​ టెస్ట్​ చేయగా.... ఐదు మాత్రమే నాణ్యమైనవిగా తేలాయని సీఎస్​ఈ వివరించింది.

మొదట పాస్.. తర్వాత ఫెయిల్​​

ఈ బ్రాండ్ల నమూనాలను గుజరాత్‌లోని నేషనల్​ డెయిరీ డెవలప్‌మెంట్​ బోర్డ్​ (ఎన్‌డీడీబీ)లోని సెంటర్​ ఫర్​ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్​ ఇన్​ లైవ్‌స్టాక్​ అండ్​ ఫుడ్​(సీఏఎల్​ఎఫ్​)లో మొదట పరీక్షించారు. ఇందులో అన్ని పెద్ద బ్రాండ్లు పాస్​ అవగా... చిన్న బ్రాండ్​లలో చెరకు రసంలో ఉండే సీ4 షుగర్ ఉన్నట్లు తేలింది. అయితే అవే బ్రాండ్ల శాంపిళ్లను జర్మనీలోని ఓ ప్రత్యేక లేబరెటరీలో ఎన్​ఎంఆర్​ పరీక్ష చేయగా 3 బ్రాండులు మాత్రమే పాసయ్యాయిని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:మహిళతో అసభ్య ప్రవర్తన- అడ్డొచ్చిన వ్యక్తిపై కాల్పులు

ABOUT THE AUTHOR

...view details