సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేంద్రం సిఫార్సు చేసింది. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి, సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినందుకు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని హోం మంత్రిత్వ కోరినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
అలోక్ వర్మపై అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), సిబ్బంది శిక్షణ విభాగానికి లేఖ రాసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. వర్మపై వచ్చిన అరోపణలు నిజమైతే ఆయన పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్‌లను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేయొచ్చని వివరించారు.
అలోక్ వర్మ సీబీఐలో పనిచేసే సమయంలో 1984 బ్యాచ్ గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఆస్తానా అవినీతి ఆరోపణలు చేశారు. అయితే అదే సమయంలో సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్ వర్మ, డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న రాకేశ్ ఆస్తానాపైనా విమర్శలు చేశారు.