Supreme Court On Hindu Minority: మైనారిటీల గుర్తింపు అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో హిందువులు 10 రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారని, రాష్ట్ర స్థాయిలో మైనార్టీల గుర్తింపు కోసం మార్గదర్శకాలు రూపొందించేలా.. ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం విచారణ జరిపింది. తక్కువ జనాభా ఉన్న వర్గాన్ని మైనార్టీలుగా గుర్తించడమా లేదా అన్న నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలదే అని ఈ ఏడాది మార్చిలో కేంద్రం.. సుప్రీంకోర్టుకు తెలిపింది. తాజాగా ఆ అధికారం కేంద్రానిదే అని, ఏ నిర్ణయమైనా రాష్ట్రాలు, సంబంధిత వ్యక్తులతో సంప్రదించిన తర్వాతే తీసుకుంటామని కేంద్రం అఫిడవిట్‌లో వివరించింది.
మైనారిటీ గుర్తింపు అంశంపై సుప్రీం అసంతృప్తి! - సుప్రీం కోర్టు కేంద్రం న్యూస్
Supreme Court On Hindu Minority: దేశంలో మైనార్టీలను గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం భిన్న వైఖరి అనుసరిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రాలతో మూడు నెలల్లోపు సంప్రదింపులు జరపాలని కేంద్రాన్ని ఆదేశించింది.
supreme court on minority
దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎమ్ఎమ్ సుందరేశ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. రాష్ట్రాలతో 3 నెలల్లోపు సంప్రదింపులు జరపాలని కేంద్రాన్ని ఆదేశించింది. భారత్‌లాంటి దేశంలో ఉండే భిన్నత్వాన్ని తాము అర్ధం చేసుకోగలమని, అయితే ఇలాంటి అఫిడవిట్‌లు దాఖలు చేసే ముందు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 30కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:దిల్లీలో మళ్లీ 'ఆపరేషన్ బుల్డోజర్'.. అడ్డుకున్న ఎమ్మెల్యే అరెస్ట్