ఈ ఏడాది ఆగస్టు 15న నిర్వహించుకోనున్న భారత 75వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా చేపట్టిన కార్యక్రమాల సన్నద్ధతపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం సమీక్షించారు. దీంతోపాటు గురు తేజ్ బహదూర్ 400వ జయంతి వేడుకలు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125 జయంతి వేడుకలపైనా ఆయన అధికారులతో చర్చించారు. ఈ మూడు సందర్భాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15, 2022న ప్రభుత్వం అనేక భారీ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనుంది.
75వ స్వాతంత్ర్య సంబరాల సన్నద్ధతపై షా సమీక్ష - అమిత్ షా
2021, ఆగస్టు 15 స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా చేపట్టిన కార్యక్రమాల సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం సమీక్షించారు. దీంతోపాటు గురు తేజ్ బహదూర్ 400వ జయంతి వేడుకలు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125 జయంతి వేడుకలపైనా ఆయన అధికారులతో చర్చించారు.
75వ స్వాతంత్ర్య సంబరాల సన్నద్ధతపై అమిత్ షా సమీక్ష
గురుతేజ్ బహదూర్ జయంతి వేడుకలకు సంబంధించి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఓ కమిటిని ఏర్పాటు చేసింది. ఇక నేతాజీ 125 జయంతి వేడుకలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి :సుహేల్దేవ్ విగ్రహానికి శంకుస్థాపన చేయనున్న మోదీ