తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. హిజ్బుల్​ కమాండర్​ హతం - హిజ్బుల్​ ముజాహిదీన్​ ఎన్​కౌంటర్​

Hizb Commander Killed: కశ్మీర్​లో ఎన్​కౌంటర్​లో.. హిజ్బుల్​ ముజాహిదీన్​ కమాండర్​ హతమయ్యాడు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు, ఓ పౌరుడికి కూడా గాయాలయ్యాయి.

Hizb commander killed in encounter in J-K's Anantnag
Hizb commander killed in encounter in J-K's Anantnag

By

Published : Jun 4, 2022, 7:47 AM IST

Hizb Commander Killed: జమ్ముకశ్మీర్​ అనంత్​నాగ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో హిజ్బుల్​ ముజాహిదీన్​ కమాండర్​ హతమయ్యాడు. మరో ముగ్గురు భారత జవాన్లు, ఓ పౌరుడికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రముఠా హిజ్బుల్​ ముజాహిదీన్ స్వీయ ప్రకటిత(సెల్ఫ్​ స్టైల్డ్​)​ కమాండర్​ నిసార్​ ఖాండేను మట్టుబెట్టినట్లు తెలిపారు కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​. ఏకే 47 రైఫిల్​ సహా ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఆపరేషన్​ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

శుక్రవారం సాయంత్రం అనంత్​నాగ్​లోని రిషిపొరా ప్రాంతంలో ఎదురుకాల్పులు ప్రారంభమైనట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ జవాన్లు, పౌరులను హుటాహుటిన శ్రీనగర్​లోని 92 బేస్​ హాస్పిటల్​కు తరలించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details